3rd new telugu text book important kaviparichayalu pdf 2021

ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా 3rd class new telugu text book మీరు మూడవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ప్రతి పాఠంలోని కవిపరిచయాలను నేర్చుకోడం జరుగుతుంది 3rd class new telugu important points అంతే కాకుండా ప్రతి పాఠం ఎవరు రచించారు మరియు ఆ రచయతల యొక్క విశేష అంశాలను నేర్చుకోవడం జరుగుతుంది ఈ విదంగా పాఠాన్ని నేర్చుకోవడం వల్ల పాఠం మరింత గుర్తుండటమే కాకుండా పోటి పరిక్షలైన DSC లో భాగంగా Quick Revision కి ఎంతగానో ఉపయగాపడతాయి.

ఈ పోస్ట్ యొక్క ఆడియో ని క్రింద వీడియో ద్వారా చూడగలరు.


ఈ పోస్ట్ యొక్క ని మీరు క్రింద లింక్ ద్వారా పొందవచ్చు.

3rd class new telugu important points pdf

 మూడవ తరగతి పాఠ్య పుస్తకంలోని కవి పరిచయాలు


తెలుగు తల్లి గేయ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు గారు


తల్లి భారతి వందనం పాట రచయిత దాశరథి కృష్ణమాచార్య గారు


ఐకమత్యం కథ రాసినది  లియో టాల్స్టాయ్ గారు


మంచి బాలుడు పాఠ్య రచయిత ఆలూరి బైరాగి గారు


కలపండి చేయి చేయి కలపండి పదిమంది భుజం భుజం కలపండి గేయ రచయిత దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు


నా బాల్యం పాఠ్య రచయిత నాజర్ గారు


బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు గేయ రచయిత మంచాల జగన్నాథ రావు గారు


పొడుపు విడుపుల పాఠ్య రచయిత చింతాదీక్షితులు గారు


అందమైన చందమామ అందరాని చందమామ గేయ రచయిత నండూరి రామమోహనరావు గారు


ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట ఎంత పరిమలమోయి తోట పూలు గేయ  రచయిత కందుకూరి రామభద్రరావు గారు


అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు పద్యం రచయిత వేమన గారు


బహుళ కావ్యములను పరికింపగా వచ్చు బహుళ శుద్ధ చయము పలుకవచ్చు రచయిత వేమన గారు


చదువు చదువుకున్న సౌఖ్యంబు నుండదు చదువు చదివెనేని సరసుడగును రచయిత వేమన గారు


ఐకమత్యము యొక్క టావశ్యకంబెప్డు దాని బలిమి యెంత అయిన గూడు పద్య రచయిత వేమన గారు


కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ పద్య రచయిత బద్దెన గారు


లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడౌ పద్యం రచయిత బద్దెన గారు


కలిమిగల లోభికన్నను విలసితముగ పేద మేలు వితరణిని అయినను పద్య రచయిత గువ్వల చెన్న గారు


దేశసేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపూరిత కంటే చావు లేదు పద్య రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు


సంపదలు తేలునప్పుడిచ్చకములాడి పద్య రచ యిత దువ్వూరి రామిరెడ్డిగారు


ఆవు పాల వంటిది అందమైన పాట పుట్ట తేనె వంటిది చిట్టి పాప మాట పాట రచయిత జి.వి సుబ్రమణ్యం గారు


మా ఊరి ఏరు పాఠ్య రచయిత మధురాంతకం రాజారాం గారు


పంట చేలు పాట రచయిత పాలగుమ్మి విశ్వనాథం గారు


అందాల తోటలో బాల ఏమంది పాడగా పాడగా తోడు రమ్మంది పాట రచయిత కస్తూరి నరసింహ మూర్తి గారు


నక్క యుక్తి పాఠ్య రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గారు


కవిపరిచయాలు


శ్రీరంగం శ్రీనివాసరావు గారు


మహాకవి , అభ్యుదయ యుగకర్త , కథకులు , నాటకకర్త , విమర్శకులు , అనువాదకులు


మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన


రచనలు


మహాప్రస్థానం


మరో ప్రస్థానం


ఖడ్గసృష్టి


అనంతం స్వీయ చరిత్రదాశరథి కృష్ణమాచార్య గారు


నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి దాశరథి కృష్ణమాచార్య గారు


నిజాం రాజ్యం నుంచి తెలంగాణ విమోచన కు మేలుకొలుపు పాడిన వారు దాశరధి కృష్ణమాచార్య గారు


పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్య గారు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్న వారు దాశరథి కృష్ణమాచార్య గారు


రచనలు


అగ్నిధార


రుద్రవీణ


మహాంధ్రోదయం


తిమిరంతో సమరం


యాత్రాస్మృతి స్వీయ చరిత్రలియో టాల్ స్టాయ్ గారు


ఐకమత్యం కథకు ఆధారమైన కథ టాల్ స్టాయ్ గారి కథ


ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవలాకారులు లియో టాల్ స్టాయ్ గారు


లియో టాల్ స్టాయ్ గారు రచించిన నవలలు


సమరం శాంతి


ఆనాకెరినినాఈసప్ కథలు


గ్రీకు పురాణ కథలు గా ప్రసిద్ధిచెందిన కథలు ఈసప్ కథలు


ఈసప్ కథలు 2500 సంవత్సరాల క్రితం నాటివి


ఈసప్ కథలు ప్రపంచ భాషలలోకి అనువదించబడిన కధలు ఈసప్ కథలుఆలూరి బైరాగి


20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవులలో ఒకరు ఆలూరి బైరాగి గారు


మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన వారు ఆలూరి బైరాగి గారు


బాలల కోసం చక్కటి గేయ కథలు రచించిన వారు ఆలూరి బైరాగి గారు


ఆలూరి బైరాగి గారు పొందిన పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం


ఆలూరి బైరాగి గారి రచనలు


చీకటి మేడలు


నూతిలో గొంతుకలు


ఆగమ గీతి


దివ్య భవనందేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు


ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు


అచ్చమైన తెలుగు కవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు


దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కవిత్వ లక్షణాలు


అక్షర రమ్యత


భావన సౌకుమార్యం


శబ్ద సంస్కారం


దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఇక్షు సముద్రం తో పోల్చిన వారు శ్రీ శ్రీ గారు


దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు అందుకున్న పురస్కారం పద్మభూషణ్


దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలు


కృష్ణపక్షం


ఊర్వశి


ప్రవాసముషేక్ నాజర్ గారు


షేక్ నాజర్ గారు తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన వారు అంగడాల రమణమూర్తి గారు


స్వీయ చరిత్రాత్మకమైన నా బాల్యం కథకు అంగడాల రమణ మూర్తి గారు పెట్టిన పేరు పింజారి


షేక్ నాజర్ గారి జననం 1920 ఫిబ్రవరి 5న గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో జన్మించారు


షేక్ నాజర్ గారు ఒక నిరుపేద ముస్లిం కుటుంబీకుడు


షేక్ నాజర్ గారి తండ్రి షేక్ మస్తాన్ గారు


ఏక్ నాజర్ గారి తల్లి బీనాబీ గారు


తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపం అయినా బుర్రకథ ప్రక్రియకు మెరుగులు దిద్దిన వారు షేక్ నాజర్ గారు


సమకాలీన అంశాలను జతచేసి రూపొందించబడిన నాజర్ గారి బుర్ర కథలు


పల్నాటి యుద్ధము


వీరాభిమన్యు


బొబ్బిలి యుద్ధం


అల్లూరి సీతారామరాజు


బెంగాల్ కరువు


నాజర్ గారు చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం సత్కరించిన పురస్కారం పద్మశ్రీ 1986


నాజర్ గారి మరణం 1997 ఫిబ్రవరి 21


మంచాల జగన్నాథ రావు గారు


కవి , సంగీత విద్వాంసులు మంచాల జగన్నాధరావు గారు


ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసిన వారు మంచాల జగన్నాధరావు గారు


బంగారు పాపాయి గేయ రచయిత మంచాల జగన్నాధరావు గారు


చింతాదీక్షితులు గారు

కవి ,కథకులు ,విద్యావేత్త చింతాదీక్షితులు గారు


తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకాల్లో ముఖ్యులు చింతాదీక్షితులు గారు


గిరిజనుల గురించి సంచారజాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు గారు


చింతా దీక్షితులు గారి రచనలు


ఏకాదశి


శబరి


వటీరావు రావు కథలు


లక్క పిడతలు


చింతా దీక్షితులు గారు సేకరించిన గేయాలు జానపద గేయాలునండూరి రామ్మోహన్ రావు గారు


నండూరి రామమోహనరావు గారు కవి , అనువాదకుడు , గొప్ప భావకవులు


నండూరి రామ్మోహన్ రావు గారు రచించిన బాలగేయాల సంపుటం హరివిల్లు


నరావతారం , విశ్వరూపం ల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభశైలిలో పాఠకులకు పరిచయం చేసిన వారు నండూరి రామ్మోహనరావు గారు


నండూరి రామ్మోహనరావు గారి రచనలు


విశ్వదర్శనం


అక్షర యాత్ర


నండూరి రామ్మోహనరావు గారి అనువాదాలు


మార్క్ ట్వేయిన్ రచించిన టామ్ సాయర్ ,హకల్ బెరి  ఫిన్చందమామ కథలు


చందమామ కథలు రచించినది ఆర్.శకుంతల (1949 బాపట్ల)
కందుకూరి రామభద్రరావు గారు


కందుకూరి రామభద్రరావు కవి , విద్యావేత్త


కందుకూరి రామభద్రరావు గారు రచించిన రచనలు


లేమొగ్గ


తరంగిణి


గేయ మంజరి
వేమన గారు 17 18 శతాబ్దాల మధ్యకాలం వారు


జన్మస్థలం కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారుల భావన


సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె


శతకం వేమన శతకం


వేమన గారి పద్యాలు


1.అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు


2.బహుళ కావ్యములను పరికింప గావచ్చు బహుళ శబ్ద చయము పలుకవచ్చు


3.చదువు చదువుకున్న సౌఖ్యంబు ఉండదు


4.ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు దాని బలం ఎంత అయినా గూడుబద్దెన గారి కాలం 13వ శతాబ్దం


శతకం  సుమతి శతకం


బద్దెన గారి పద్యాలు


1.కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్


2.లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడౌగువ్వల చెన్నగారి కాలం  17 18 శతాబ్దాలలో మధ్య వారు


జన్మస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం


మకుటం గువ్వలచెన్నా


గువ్వల చెన్నడు పద్యాలు


1.కలిమిగల లోభికన్నను విలసితముగ పేద మేలు వితరణి అయినన్జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు


జననం 4 – 8 - 1912


జన్మస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం లో జన్మించారు


జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన కావ్యాలు


విజయశ్రీ


ఉదయశ్రీ


కరుణశ్రీ


జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పద్యం


1.దేశసేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపూరిత కంటే  చావు లేదు
దువ్వూరి రామిరెడ్డి గారు


కాలం 911-1895  నుండి  11-09-1947


జన్మస్థలం నెల్లూరు జిల్లా


దువ్వూరి రామి రెడ్డి గారి రచనలు


కృషీవలుడు


జలదాంగన


గులాబీ తోట


పానశాల


దువ్వూరి రామిరెడ్డి గారు రచించిన పద్యం


1.సంపదల తేలినప్పుడిచ్చకములాడితాళ్ళపాక తిమ్మక్క గారు


తెలుగులో మొదటి కవియత్రి తాళ్ళపాక తిమ్మక్క గారు


తాళ్ళపాక తిమ్మక్క గారి యొక్క అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ


తాళ్ళపాక అన్నమాచార్యుల గారి భార్య తాళ్ళపాక తిరుమలమ్మ గారు


సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాసినవారు తాళ్ళపాక తిరుమలమ్మగారు


తేట తెలుగు పదాలతో ఉండి అందరిచేత ప్రశంసలు అందుకున్న తాళ్ళపాక తిరుమలమ్మ గారి కావ్యం సుభధ్రా కళ్యాణం

జి. వి సుబ్రహ్మణ్యం గారు


జి.వి.సుబ్రహ్మణ్యం గారు విద్వాంసులు , విమర్శకులు


తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టినవారు జివి సుబ్రహ్మణ్యం గారు


జి.వి సుబ్రహ్మణ్యం గారు రచించిన రచనలు


వీర రసము


రసోల్లాసము


సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేసిన వారు జివి సుబ్రమణ్యం గారుమధురాంతకం రాజారాం గారు


మధురాంతకం రాజారాం సుప్రసిద్ధ కథకులు


రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు వందలకు పైగా కథలు రాసిన వారు మధురాంతకం రాజారాం


మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రీకరించిన వారు మధురాంతకం రాజారాం


ఉత్తమ ఉపాధ్యాయులు గా ప్రసిద్ధి చెందిన వారు మధురాంతకం రాజారాం


మధురాంతకం రాజారాం అందుకున్న పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంపాలగుమ్మి విశ్వనాథం గారు


పాలగుమ్మి విశ్వనాథం గారు ఒక గీత కర్త


ఆకాశవాణిలో పనిచేసిన వారు పాలగుమ్మి విశ్వనాథం గారు


లలిత సంగీతానికి ప్రచారం కల్పించిన వారు పాలగుమ్మి విశ్వనాథం గారు


వేలాది పాటలకు సంగీతం కూర్చిన వారు పాలగుమ్మి విశ్వనాథం గారుకస్తూరి నరసింహ మూర్తి గారు


అందాల తోటలో బాల ఏమంది పాడగా పాడగా తోడు రమ్మంది గేయం ను రచించినవారు కస్తూరి నరసింహ మూర్తి గారు


అందాల తోటలో బాల ఏమంది పాడగా పాడగా తోడు రమ్మంది పాటను కస్తూరి నరసింహ మూర్తి గారు తీసుకున్న గేయ సంపుటి పాపాయి సిరులు
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు


గద్వాల సంస్థాన కవి అవధాన విద్య లో నిష్ణాతులు సహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు


జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన రచనలు


ఆంధ్రుల చరిత్ర


ఆంధ్ర సామ్రాజ్యం


రత్న లక్ష్మీ శతపత్రము


కేనోపనిషత్తు

మూడవ తరగతి తెలుగు పాఠం లోని వ్యాకరణాంశాలు క్రింది లింక్ ద్వారా చూడవచ్చు

వ్యాకరణాంశాలు

మూడవ తరగతి తెలుగు పాఠం లోని ముఖ్యాంశాలు క్రింది లింక్ ద్వారా చూడవచ్చు

 ముఖ్యాంశాలు

Post a Comment

0 Comments