new 3rd class telugu text book important bits 2021

 ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా 3rd class new telugu text book మీరు మూడవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకములోని ముఖ్యమైన అంశాలను నేర్చుకోవడం జరుగుతుంది 3rd class new telugu important points ఈ విధంగా ప్రతి పాఠ్యపుస్తకములలోని ముఖ్యమైన విషయాలను చదవడం వల్ల మనకి పాఠం మరింత అర్ధం అవుతుంది ఈ అంశాలు పోటి పరిక్షలైన DSC కి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ పోస్ట్ యొక్క ఆడియో ని క్రింద వీడియో ద్వారా చూడగలరు.ఈ పోస్ట్ యొక్క ని మీరు క్రింద లింక్ ద్వారా పొందవచ్చు.

3rd class new telugu important points pdf

మూడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని ముఖ్యాంశాలు


తెలుగు తల్లి

తెలుగు తల్లి పాఠం ప్రక్రియ గేయం

తెలుగు తల్లి పాఠం ఇతివృత్తం దేశభక్తి

అదెవోతెలుగు తల్లి
అందాల నిండు జాబిల్లి అన్న గేయ కవి శ్రీ శ్రీ గారు

సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల అన్న గేయకవి శ్రీ శ్రీ గారు

అదిగో సుదూర నేల చనవోయి తెలుగు వీర అన్న గేయకవి శ్రీ శ్రీ గారు

కదలవోయి ఆంధ్ర కుమారా నిద్ర వదలవోయి నవ యుగం అనే పంక్తులు ఉన్న పాఠ్యాంశం తెలుగు తల్లి

తల్లి భారతి వందనం గేయం రచయిత దాశరథి కృష్ణమాచార్య గారు

నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు

పద్యాన్ని పాటని కూడా సమంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు

ఆంధ్రప్రదేశ్ స్థానం కవిగా ఉన్న వారు దాశరధి కృష్ణమాచార్యులు గారు

చదువులు బాగా చదివెదవమ్మా జాతి గౌరవం పెంచెదవమ్మా అన్న గేయకవి దాశరథి కృష్ణమాచార్యులు గారు

తెలుగు జాతికీ అభ్యుదయం నవ జాతికి నవోదయం అన్న గేయ కవి దాశరధి కృష్ణమాచార్యులు గారు

తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము అన్న గేయ కవి దాశరథి కృష్ణమాచార్య గారు

కుల మత భేదం మరిచెదము కలతలు మాని మెలిగెదము అన్న గేయకవి దాశరధి కృష్ణమాచార్యులు గారు

ఐకమత్యం కథకు ఆధారం లియో టాల్స్టాయ్ గారి కథ

లియో టాల్స్టాయ్ గారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవాలాకారులు

ఐకమత్యం కథ

రామాపురం అనే గ్రామంలో లో ఉండే రైతుకు ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కుమారులకు ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని పుల్లలకట్ట సహాయంతో తెలియజేయడమే ఐకమత్యం కథ యొక్క ఉద్దేశం

మర్యాద చేద్దాం

మర్యాద చేద్దాం పాఠం ఒక ప్రక్రియ కథ

మర్యాద చేద్దాం పాఠం ఇతివృత్తం హాస్యం

మర్యాద చేద్దాం పాఠం సారాంశము

పరమానందయ్య గారి ఇంటికి వచ్చిన పేరయ్య అని పండితుడిని పరమానందయ్య శిష్యులు సత్కరించిన తీరు మరియు దాని తర్వాత పరమానందయ్య గారి ఇంటిలో పడిన ముగ్గురు దొంగలు ని పరమానందయ్య శిష్యులు సత్కరించిన తీరును హాస్యభరితంగా వివరించే పాఠం మర్యాద చేద్దాం

ముఖ్యాంశాలు

పూర్వం కళింగ రాజ్యం లో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు.

పరమానందయ్య కు 12 మంది శిష్యులు.

పరమానందయ్యగారు భార్యతో కలిసి గుడికి వెళ్ళిన సమయంలో పొరుగూరు నుండి వచ్చిన పండితుడు పేరయ్య

పరమానందయ్య ఇంటి లోకి ప్రవేశించిన దొంగలు ముగ్గురు

రేలా...రేలా... జానపద గేయం

అడవి చల్లంగుంటె - అన్నానికి కొదవే లేదు అనే పంక్తి గల గేయం రేలా...రేలా...

అడవి తల్లికి దండాలో -  మా తల్లి అడవికి దండాలో..... అనే పంక్తి గల గేయం రేలా.... రేలా....

కొండలనుండి కోనలనుండి
గోదారమ్మ పరుగులు చూడు అనే పంక్తి గల గేయం రేలా.. రేలా..

ఒంపులు తిరుగుతూ ఒయ్యారంగా
పెను గంగమ్మ ఉరకలు చూడు అనే పంక్తి గేయం రేలా... రేలా...

ఏటిలోన ఊట చూడు
నీటిలోన సుడులు చూడు అనే పంక్తి గల గేయం రేలా... రేలా....

పావురాల జంట చూడు
పాలపిట్ట పాట చూడు అనే పంక్తి గల గేయం రేలా... రేలా...

ఈసప్ కథ

జింక కథ ఈసప్ కథలు కు సంబంధించినది

జింక పాఠం ప్రధాన ఉద్దేశం

జింక తన ప్రతిబింబాన్ని నీటిలో చూసుకొని మురిసిపోతుంది. తన చీపురుపుల్లలా ఉన్న కాళ్ళని చూసి ఏం బాగాలేవు అనుకుంటుంది కానీ సింహాన్ని చూసి పరిగెట్టేటప్పుడు అది పారిపోవడానికి ఉపయోగపడినవి తన చీపురు పుల్ల లా భావించిన కాళ్ళు అని తను ఎంతో అందంగా ఉన్నాయి అని భావించిన తన కొమ్ములు తన ప్రాణం మీదకి తెచ్చి పెట్టాయని తెలుసుకుంటుంది

మంచి బాలుడు

మంచి బాలుడు పాఠం ప్రక్రియ గేయ కథ

మంచి బాలుడు పాఠం ఇతివృత్తం సహానుభూతి

మంచి బాలుడు పాఠం ఉద్దేశం
బోరు వానలో గడగడ వణుకుతూ నడుస్తున్న ఒక ముసలమ్మను చేయి పట్టుకుని రోడ్డు దాటించి ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చిన వాడు మంచి బాలుడు

ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం

కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని తెలియజేయడం

ముఖ్యాంశాలు

మంచి బాలుడు పాఠ్య రచయిత ఆలూరి బైరాగి గారు

మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి గారు

ఆగమ గీతి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వారు ఆలూరి బైరాగి గారు

స్నేహితులారా ఆ ముసలమ్మ కూడా మరొకరికి అమ్మే అని ఆలోచించారా అన్న వాక్యం గల పాఠ్యాంశం మంచి బాలుడు

దుర్భలులకు సాయం చేయని యెడ కొరగా దెందుకు మనుజుని మనుగడ అన్న వాక్యం గల పాఠ్యాంశం మంచి బాలుడు

కలపండి చేయి చేయి కలపండి
పదిమంది భుజం భుజం కలిపండి అన్న గేయం కవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు

కొండ రాళ్లు పగలకొట్టి కోన చదును చేద్దాం
కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం అన్న గేయ కవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు

పాడుకుంటూ పనిచేస్తే పదిమందికి లాహిరి
ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి అన్న గేయకవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు


బావిలో నీళ్ళు కథ

బావిలో నీళ్ళు కథ అక్బర్ బీర్బల్ కథ లోనిది

బావిలో నీళ్లు కథలోని పాత్రలు

అక్బర్ రాజు

బీర్బల్ మంత్రి

రైతు

జమీందారు

బావిలో నీళ్లు కథ ఉద్దేశం

రైతుతో  నేను నీకు బావిని అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మ లేదు ,నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అన్న జమీందారు కు బీర్బల్ తెలివితో రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి వెంటనే బావిలో నీళ్ళు అన్నీ తోడ్కొని వెళ్లిపో లేదా నీళ్ళు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని తెలివైన తీర్మానం ఇవ్వడం

నా బాల్యం

నా బాల్యం పాఠ్య ప్రక్రియ ఆత్మకథ

నా బాల్యం పాఠ్య ఇతివృత్తం కళలు

నా బాల్యం పాఠ్యాంశంలోని పాత్రలు

షేక్ నాజర్

ఖాదర్ హార్మోనిస్ట్ నాజర్ గారి గురువు

షేక్ మస్తాన్ నాజర్ తండ్రి

షేక్ నాజర్ గారు తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన వారు అంగడాల రమణ మూర్తి గారు

స్వీయ చరిత్రాత్మకమైన నా బాల్యం కథకు రమణమూర్తి గారు పెట్టిన పేరు పింజారి

బుర్రకథ పితామహుడుగా పేరొందిన వారు షేక్ నాజర్ గారు

షేక్ నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో సత్కరించిన పురస్కారం పద్మశ్రీ

నాజర్ తన చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవంలో ఆడిన నాటకం ద్రోణ విజయం

ద్రోణ విజయం నాటకం లో నాజర్ ప్రతిభను గుర్తించిన తరగతి ఉపాధ్యాయుడు వీరికి బహుమతిగా ఇచ్చినవి ఐదు రూపాయలు పుస్తకం పెన్సిల్

సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అన్న వాక్యం గల పాఠ్యాంశం నా బాల్యం

గారపాడు మామలు అత్తలు నాజర్ ని పిలిచే పేరు అబ్దుల్ అజీజ్

పొన్నెకల్లు పెదనాన్నలు చిన్నాన్నలు అమ్మలూ అక్కలూ  పిలిచే పేరు నాజరూ

"
హ...అదిగో లేడీ
పరిగెడుతోంది
లేడి బోయెరా
హ.. బాణమేయరా" అని పాడుతూ గంతులు వేసినవారు నాజర్ గారు

"
నేనే బ్రహ్మనురా
పామరులారా
ఓ జనులారా
నేనే బ్రహ్మనురా" అని కూనిరాగాలు తీస్తుండేవారు నాజర్ గారు

బంగారు పాపాయి

బంగారు పాపాయి పాట రచించిన వారు మంచాల జగన్నాథ రావు గారు

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు గేయరచయిత మంచాల జగన్నాథ రావు గారు

తెనుగు దేశం నాది, తెనుగు పాపను నేను
అని పాప జగమంత చాటి వెలయించాలి అన్న గేయరచయిత మంచాల జగన్నాథ రావు గారు

పల్లె సీమల కు పోయి, తెలివిగల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి అన్న గేయరచయిత మంచాల జగన్నాథ రావు గారు

మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి అన్న గేయ రచయిత మంచాల జగన్నాథ రావు గారు

బంగారు మొలక కథ

బంగారు మొలక కథ సారాంశం

ముసలి తాత మామిడి మొక్కలను తన కొడుకు కూతురు మరియు వారి పిల్లల కోసం మరియు జనం కోసం నాటుతాడు అది చూసిన రాజు ఈ మొక్క ఎప్పుడు చెట్టవుతుంది? ఎప్పుడు కాయలు కాస్తుంది ? ఈ ముసలివాడు ఎప్పుడు తింటాడు? అని తాత ని అడగగా తాత ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పనిలేదు రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఈ కథ ఉద్దేశం దానికిగాను రాజు పాతిక బంగారు నాణేలను తాతకు బహుమానంగా ఇస్తారు

పొడుపు విడుపు

పొడుపు విడుపు పాఠ్య ప్రక్రియ సంభాషణ

పొడుపు విడుపు పాఠ్య ఇతివృత్తం భాషా అభిరుచి

పొడుపు పొడుపు పాఠం లోని పాత్రలు

గిరి

సూరి

వెంకీ

సీతి

కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నది మామయ్య

వసారాలో  కూర్చుని చందమామ కథలను చదువుకుంటున్నది గిరి

ఎప్పుడూ కథలైనా ఇంకేమైనా చెప్పు అన్నది సీతి సూరితో

తీసే కొద్దీ పెరిగేది ఏమిటి గొయ్యి

వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ముగ్గులు

నూరు చిలుకల ఒకటే ముక్కు పళ్ళ గుత్తి

పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకుని నూతిలో పడ్డాడు అరటిపండు

ఇంట్లో కలి ఒంట్లో కలి ?

ఇంట్లో కలి అంటే రోకలి

ఒంట్లో కలి అంటే ఆకలి

తెల్లని పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు పుస్తకం

చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగ నుండు కొబ్బరికాయ

పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడుమ మెలికల గిలక నాలుక

అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పువ్వుల్లో రెండే కాయలు సూర్యుడు చంద్రుడు

చందమామ

అందమైన చందమామ అందరాని చందమామ అన్న గేయ కవి నండూరి రామమోహనరావు గారు

రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగురు ఎగిరిపోనా అన్న గేయ రచయిత నండూరి రామ్మోహన్ రావు గారు

గున్నమావి కొమ్మ లో
సన్నజాజి రెమ్మలలో
నక్కినక్కి దొంగల్లే
నన్ను చూచి నవ్వినాడే అన్న గేయరచయిత నండూరి రామ్మోహనరావు గారు

నండూరి రామ్మోహనరావు గారు రచించిన బాలగేయాల సంపుటం హరివిల్లు


వికటకవి కథ

తెనాలి రామకృష్ణ కథలులోని కథే వికటకవి కథ

కృష్ణా తీరంలో ఉన్న ఊరు గార్లపాడు

గార్లపాడు ఊరిలోని పండితుడు రామయ్య మంత్రి

రామయ్య భార్య లక్ష్మమ్మ

రామయ్య లక్ష్మమ్మ యొక్క కుమారుడు రామకృష్ణుడు

తెనాలి రామకృష్ణుని కి మరొక పేరు రామలింగడు

రామకృష్ణునికి మంత్రం చదువుతూ ఉండమని చెప్పిన వారు సాధువు

మంత్రం జపిస్తున్న రామకృష్ణుడికి ఎదురైన దేవత కాళికాదేవి

కాళికాదేవి ప్రత్యక్షమై ఏ పాత్రలు చూపించి రామకృష్ణుని ఎన్నుకోమనింది పాలు పాత్ర, పెరుగు పాత్ర

గొప్ప పండితుడవుతాడు అని చెప్పిన పాత్ర పాలు పాత్ర

ఐశ్వర్యవంతుడివి అవుతావు అన్న పాత్ర పెరుగు పాత్ర

రామకృష్ణుడు ఎంచుకున్న పాత్రలు రెండు పాత్రలు (రెండు పాత్రల్లో ని పాలు పెరుగు ఒకేసారి నోట్లో వేసుకున్నాడు)

కాళికాదేవి రామకృష్ణుని పై కోపంతో ఇచ్చిన బిరుదు వికటకవి

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే పదాలు భ్రమక పదాలు

ధనం లేని పాండిత్యం పాండిత్యం లేని ధనం రెండు వ్యర్థమే అందుకే రెండు కావాలనుకున్నాను అని ప్రాధేయపడింది రామకృష్ణుడు

మేమే మేక పిల్ల

మేమే మేక పిల్ల పాఠం ప్రక్రియ కథ

మేమే మేకపిల్ల పాఠం ఇతివృత్తం పరస్పర సహకారం

మేమే మేక పిల్ల పాఠ్యాంశం ఆర్ శకుంతల గారు రచించిన చందమామ కథల నుండి స్వీకరించబడింది

బాపట్ల గ్రామ వాసి ఆర్ శకుంతల గారు (1949)

మేమే మేక పిల్ల పాఠం ఉద్దేశం

అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని తెలియజేయడం

ముఖ్యాంశాలు

అనగనగా ఒక ఒక ఊరు ఆ ఊరిలో ని ఒక మేకకు నలుగురు పిల్లలు

మేమే అనే పేరు గల మేక నాలుగవ మేక

ఢిల్లీ రాజు ను చూడాలని బుద్ధి పుట్టిన మేక నాలుగవ మేక

ఢిల్లీ వెళ్దాం - రాజును చూద్దాం అనే వాక్యం గల పాఠ్యాంశం మేమే మేకపిల్ల

తొందరెక్కువ మాటవినదు అనే లక్షణాలు ఉన్న మేక నాలుగవ మేక

ఢిల్లీ రాజును చూడడానికి వెళుతున్న మేకకు మొదటిగా ఎదురైనది ఏరు

ఏరు అడిగిన సహాయం ఏరు పై పడిన కొమ్మకు గల ఆకులను తీసేయమని అడగడం

ఢిల్లీ రాజు ని చూడడానికి వెళుతున్న మేకకు రెండవసారి ఎదురైనది మంట

మంట మేకను అడిగిన సహాయం నేను ఆరిపోతున్నాను కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మ అని అడగడం

ఢిల్లీ రాజును చూడడానికి వెళుతున్న మేకకు మూడవసారి ఎదురైనది చెట్టు

చెట్టు మీదుగా వచ్చే గాలి మేక ను అడిగిన సహాయం చెట్టు చుట్టూ ఉన్న కంచె ను కొంచెం జరపమని అడగడం

మేమే మేక పిల్ల కి నాలుగవ సారి ఎదురైంది రాజుగారి వంటవాడు

బలే బలే మేకపిల్ల అండి ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్లినవాడు రాజుగారి వంటవాడు

మేమే మేక పిల్ల మొదటి సాయం అడిగింది నీళ్లను

నీళ్లు మేమే మేక పిల్ల ని ఎవరిని సహాయం అడగమని చెప్పింది నిప్పు

నిప్పు మే మే మేక పిల్ల ని ఎవరిని సాయం అడగమని చెప్పింది గాలి

చూసావా మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు మరి నీకు ఎవరు సహాయం చేస్తారు అని అన్నది గాలి

'
ఢిల్లీ వద్దు
రాజూ వద్దు
అమ్మ మాటే వింటా
ఉండదు నాకే తంటా' అనే వాక్యాలు గల పాఠ్యాంశం మే మే మేకపిల్ల

నామవాచకానికి బదులుగా వాడే పదాలు సర్వనామాలు

సర్వ నామాలకు ఉదాహరణ అతడు , ఆమె , అది , మేము , నేను , వారు , వీరు  మొదలైనవి

తెలుగు తోట

తెలుగు తోట గేయరచయిత కందుకూరి రామభద్రరావు గారు

ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట
ఎంత పరిమళమోయి ఈ తోట పూలు అన్న గేయరచయిత కందుకూరి రామభద్రరావు గారు

ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో
ఏ స్వర్ణ నదీజలము ఈ మడుల కెత్తిరో అన్న గేయరచయిత కందుకూరి రామభద్రరావు గారు

ఏ అమృత హస్తాల ఏసురలు తాకిరో
ఏ అచ్చెరల మెరుపులీతీరు దిద్దిరో అన్న గేయ రచయిత  కందుకూరి రామభద్రరావు గారు


మేకపోతు గాంభీర్యం కథ

మేకపోతు గాంభీర్యం అనేది ఒక జాతీయం

మేకపోతు గాంభీర్యం కథ యొక్క ఉద్దేశం

ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడం

ఏయ్ ఎవరు నువ్వు అని సింహాన్ని గద్దించి అడిగింది మేక

అయ్యా నేను ఈ అడవికి రాజు తమరు ఎవరు అని అడిగింది సింహం

నా గురించి నీవు వినలేదా ఇప్పటివరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను నూరు సింహాలని చంపితే కానీ నా గడ్డం తియ్యనని వ్రతం పట్టాను నీకోసమే ఎదురు చూస్తూ నీ గుహలోనే మాటు వేశాను నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని గంభీరంగా అన్నది మేక

పద్య రత్నాలు

పద్య రత్నాలు పాఠ్య ప్రక్రియ పద్యాలు

పద్య రత్నాలు పాఠ్య ఇతివృత్తం నైతిక విలువలు

సుమతి మకుటం బద్దెన గారు

తెలుగు బాల మకుటం రాసిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) గారు

తెలుగులో మొదటి కవియత్రి తాళ్ళపాక తిరుమలమ్మ గారు

తాళ్ళపాక తిరుమలమ్మ గారి అసలు పేరు తిరుమలమ్మ

తాళ్ళపాక అన్నమాచార్యుల వారి భార్యే తాళ్ళపాక తిరుమలమ్మ

తాళ్ళపాక తిరుమలమ్మ గారు రాసిన కావ్యం సుభద్రా కళ్యాణం

తేట తెలుగు పదాలతో ఉండి అందరిచేత ప్రశంసలందుకున్న తాళ్ళపాక తిరుమలమ్మ గారు రచించిన కావ్యం సుభద్ర కళ్యాణం

పనులను తెలియజేసే పదాలు క్రియా పదాలు

అందమైన పాట

అందమైన పాట గేయరచయిత జి వి సుబ్రహ్మణ్యం గారు

ఆవు పాల వంటిది అందమైన పాట
పుట్ట తేనె వంటిది చిట్టి పాప మాట అన్న గేయరచయిత జివి సుబ్రహ్మణ్యం గారు

అమ్మ పాట పాప లకు కమ్మని చెవివిందు
బొమ్మలాట పాప లకు కమ్మని కనువిందు అన్న రచయిత జి వి సుబ్రహ్మణ్యం గారు
పాటలతో ఆటలాడు పాపాయిల చెలిమి
దేశమాత మనసులోని ఆశలకే బలిమి అన్న గేయరచయిత జి వి సుబ్రమణ్యం గారు

పాట పాడి బుజ్జి పాప పారవశ్యమొందాలి
మాటలాడి ముద్దు పాప మనుగడ సాధించాలి అన్న గేయరచయిత జి.వి.సుబ్రహ్మణ్యం గారు

అందాలను చందాలను పందిరిగా వేయాలి
అందులోన లతలవోలె అల్లుకుంటూ పోవాలి అన్న గేయ రచయిత జి.వి.సుబ్రహ్మణ్యం గారు

కన్నతల్లి ముద్దులోని వెన్నెలారగించాలి
కన్న తండ్రి ముద్దులోని వెన్నెల వెలిగించాలి అన్న రచయిత జివి సుబ్రహ్మణ్యం గారు

చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి
తెలుగు వాణి తియ్యదనము నలుమూలల తెలపాలి అన్న గేయరచయిత జివి సుబ్రహ్మణ్యం గారు

దిలీపుని కథ

దిల్ పులి కథ ఒక పురాణ కథ

దిలీపుని కథ లోని పాత్రలు

దిలీప మహారాజు

సుదక్షిణాదేవి

వశిష్టుడు

నందిని ఆవు

రఘుమహారాజు

సింహం

దిలీప మహారాజుని భార్య సుదక్షిణాదేవి

దిలీప మహారాజుని కుమారుని పేరు రఘుమహారాజు

మహారాజు పిల్లలు లేరనే తమ బాధను గురువైన వశిష్టునికి తెలపగా గురువు ఆయనకు ఇచ్చిన ఆవే నందిని

నందిని ని ఆహారంగా కోరుకున్నది సింహం

నీవు బ్రతికి ఉంటే వేయి ఆవులను దానం చేయగలవు నీ ప్రాణాలు వదులుకుంటావా అని దిలీప మహారాజుని ప్రశ్నించింది సింహం

ఒక గో మాతాను కాపాడలేని , ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అన్నవారు దిలీప మహారాజు

సింహం రూపంలో ఉన్న వారు దేవతలు

నువ్వు మా పరీక్షలో నెగ్గావు ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు అని దిలీప మహారాజునితో అన్నవారు దేవతలు

శ్రీ రాముని వంశం రఘుమహారాజుని వంశం

మా వూరి పేరు

మా వూరి ఏరు పాఠ్య ప్రక్రియ గేయం

మా వూరి ఏరు  పాఠ్య ఇతివృత్తం ప్రకృతి వర్ణన

చూడచక్కని ఏరు మా వూరి ఏరు !
ఏడాది కొకసారి ముచ్చటగ పారు అన్న గేయ రచయిత మధురాంతకం రాజారాం గారు

పొదరిండ్లు దాగి మొగలి ముగ్గల్లు
మధుర సుగంధమ్ము దిక్కులను జల్లు నన్న గేయ రచయిత మధురాంతకం రాజారాం గారు
ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది
ఉరవడితో మా ఏరు ప్రవహించుతుంది అన్న గేయ రచయిత మధురాంతకం రాజారాం గారు

చూడవలనే గాని చెప్పంగ లేము
ముణాళ్ళ తిరుణాల మా ఏటి వరద అన్న గేయ రచయిత మధురాంతకం రాజారాం గారు

ఇంకిపోయిననేమి మా ఏటిలోన
ఇసుక తిన్నెలు కనుల పండుగై యుండు అన్న గేయ రచయిత మధురాంతకం రాజారాం గారు

కృష్ణా నదికి మరియొక పేర్లు కృష్ణవేణి, కృష్ణమ్మా, కృష్ణ

పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టినది కృష్ణా నది

కృష్ణమ్మ కొండలు, కోనలు దాటి శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేసే నది కృష్ణా నది

కృష్ణా నది ప్రయాణం 1400 కిలోమీటర్లు

కృష్ణా నది చివరిగా  హంసల దీవి వద్ద రెండు పాయలుగా చీలి కలిసే ప్రదేశం బంగాళాఖాతం

పంట చేలు

పంట చేలు గేయ రచయిత పాలగుమ్మి విశ్వనాథం గారు

పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి అన్న గేయ రచయిత పాలగుమ్మి విశ్వనాథం గారు(పంట చేలు)

ఒయ్యారి నడకలతో ఆ ఏరు
ఆ ఏరు దాటితే మా ఊరు అన్న గేయరచయిత పాలగుమ్మి విశ్వనాథం గారు(పంట చేలు)

పచ్చని పచ్చికపైనా  మేను వాల్చాలి
పైర గాలి వచ్చి నన్ను కౌగిలించాలి అన్న గేయ రచయిత పాలగుమ్మి విశ్వనాథం గారు(పంట చేలు)

చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషులు కలవాలి అన్న గేయ రచయిత పాలగుమ్మి విశ్వనాథం గారు (పంట చేలు)

బుద్ధి బలం కథ

బుద్ధి బలం కథ పంచతంత్ర కథల నుండి స్వీకరించబడింది

పాత్రలు

బాసు రకం అనే సింహం

కుందేలు

బుద్ధి బలం కథ యొక్క ఉద్దేశం

బుద్ధిబలంతో సమస్యల నుండి బయట పడవచ్చు అని తెలపడం

బుద్ధి బలం కథ యొక్క సారాంశం

కుందేలు తన బుద్ధిబలంతో భాసురకం అనే సింహాన్ని బావి దగ్గరకు తీసుకెళ్లి తన నీడను చూసి తానే తిరగబడే లాగా చేసి , కుందేలు తన బుద్ధి బలంతో సింహం పీడ నుండి అడవి జంతువులను కాపాడుతుంది

తొలి పండుగ పాఠం

తొలి పండుగ పాఠం ప్రక్రియ కథనం

తొలి పండుగ పాఠం ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు

తొలి పండుగ పాఠం లోని పాత్రల పేర్లు

రవి నడవలేడు

లత (రవి వాళ్ళ అక్క)

శామ్యూల్

ఆనంద్

కరీముల్లా

రంగయ్య తాత

తొలి పండుగ పాఠం లోని ముఖ్య అంశాలు

మాధవరం చాలా అందమైన గ్రామం

మాధవరం గ్రామం చివరన ఉండే తాతలనాటి వేపచెట్టు ఆ గ్రామానికి అందం

వేప పూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉండే రుతువు వసంత రుతువు

అదిగో లతా రవి వస్తున్నారురా అని అన్నది ఆనంద్.వాళ్ల బుట్టలో ఏవో తెస్తున్నారురా అన్నది సామ్యూల్.


శామ్యూల్ తెచ్చిన పదార్థం బెల్లం ముక్కలు.

ఆనంద్ తెచ్చినవి జామకాయలు.

చాలా తెచ్చాం కూర్చుండి అన్నది రవి.

"
అబ్బా! పూర్ణం బూరెలు ,గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో!"అన్నది ఆనంద్.

ఈ రోజు ఉగాది పండుగ కదా మా అమ్మ చేసింది వీటన్నిటి కంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అని అన్నది రవి.

"
అరే! బలే ఉంది ఉగాది పచ్చడి తీయ్య తియ్యగా పుల్ల పుల్లగా చేదు చేదుగా" అని అన్నది శామ్యూల్.

రంగయ్య తాతని తాత ! చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాను తర్వాత పూర్ణాలు గారెలు కూడా పెడతాను అని అన్నది లత.

రామాలయం దగ్గర కరీముల్లాని చూసి "కరీమ్ మామా! ఎందుకు ఇవన్నీ కడుతున్నారు?"అని అడిగిన వాడు శామ్యూల్.

ఉగాది పండుగ కు మరియెక్క పేర్లు తెలుగు సంవత్సరాది, యుగాది.

ఉగాది పండుగను జరుపుకునే రోజు చైత్ర శుద్ధ పాడ్యమి.

ఉగాది పచ్చడి ప్రతీక కష్ట సుఖాల కలయిక.

ఉగాది పచ్చడి లోని రుచులు షడ్రుచులు.

షడ్రుచులు అనగా తీపి , పులుపు , కారం , వగరు , చేదు , ఉప్పు.

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

ప్రభవ

విభవ

శుక్ల

ప్రమోదూత

ప్రజోత్పత్తి

అంగీరస

శ్రీముఖ

భావ

యువ

ధాత

ఈశ్వర

బహుధాన్య

ప్రమాది

విక్రమ

వృష

చిత్రభాను

స్వభాను

తారణ

పార్థివ

వ్యయ

సర్వజిత్తు

సర్వధారి

విరోధి

వికృతి

ఖర

నందన

విజయ

జయ

మన్మధ

దుర్ముఖి

హేవిళంబి

విళంబి

వికారి

శార్వరి

ప్లవ

శుభకృతు

శోభకృతు

క్రోధి

విశ్వావసు

పరాభవ

ప్లవంగ

కీలక

సౌమ్య

సాధారణ

విరోధికృత్తు

పరీధావి

ప్రమాది

ఆనంద

రాక్షస

నల

పింగళ

కాళయుక్తి

సిద్ధార్థి

రౌద్ర

దుర్మతి

దుందుభి

రుధిరోద్గారి

రక్తాక్షి

క్రోధన

అక్షయ

శార్వరి అనేది తెలుగు సంవత్సరాలలో ఎన్నవది 34

తెలుగు నెలలు

చైత్రం

వైశాఖం

జ్యేష్ఠం

ఆషాడం

శ్రావణం

భాద్రపదం

ఆశ్వయుజం

కార్తీకం

మార్గశిరం

పుష్యం

మాఘం

ఫాల్గుణం

అందాల తోటలో

అందాల తోటలో గేయ రచయిత కస్తూరి నరసింహ మూర్తి గారు

అందాల తోటలో బాల ఏమంది ?
అడిగా పాడగా తోడు రమ్మంది అన్న గేయ రచయిత కస్తూరి నరసింహ మూర్తి గారు

గున్న మామిడి పైని కోయిలేమంది
కూ అంటే కూ అన్న కొంటె ఎవరంది అన్న పంక్తులు గల గేయం అందాల తోట

నక్క యుక్తి కథ

నక్క యుక్తి కథ రచించినవారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

నక్క యుక్తి పాఠ్య ఉద్దేశం ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవడం

నక్క యుక్తి పాఠ్య సారాంశం

నక్క ఒకనాడు నది దాట వలసి వచ్చింది . అప్పుడు నదిలోని ఒక ముసలి రాగా దానికి ఒక ఉపాయం తట్టింది . అడవిలో ముసలి లు ఎక్కువ లేదా నక్కలు ఎక్కువ అని దానిని అడిగింది ముసలి నువ్వే లెక్కబెట్టు అని వరుసగా నదిలోని ముసళ్ళను నిలబెట్టింది దానితో నక్క ఒకరిపై ఎగురుతూ లెక్కిస్తాను అని నది దాటింది

 మూడవ తరగతి తెలుగు పాఠం లోని వ్యాకరణాంశాలు క్రింది లింక్ ద్వారా చూడవచ్చు

 వ్యాకరణాంశాలు


మూడవ తరగతి తెలుగు పాఠం లోని కవిపరిచయాలను క్రింది లింక్ ద్వారా చూడవచ్చు 


 కవిపరిచయాలు 

Post a Comment

0 Comments