ఈ రోజు మనం ఈ
పోస్ట్ ద్వారా new 3rd
class to 6th class science important bits కొత్తగా వచ్చిన మూడవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు
ఉన్న పార్యపుస్తకాలలోని సైన్సు విభాగానికి చెందిన ముఖ్యమైన విషయాలు వివరించడం
జరిగింది
ఈ పోస్ట్
లో వివరించిన పాఠాలు
నీరు (3rd, 4th ,5th
,6th classes)
వాతావరణ మార్పులు (5th class)
దుస్తులు ఎలా
ధరించాలి (6th
class)
కొలుద్దాం ( 6th class)
పదార్దాలు వేరు
చేసే పద్దతులు (6th
class)
నీడలు ప్రతిబింబాలు
(6th class)
విద్యుత్ వలయాలు (6th class)
అయస్కాంతాలతో సరదాలు (6th class
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పాఠశాలలో నీటి గంటలు అనే
కార్యక్రమాన్ని పరిచయం చేసారు.ఇది రోజుకు 3 సార్లు మ్రోగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థులు నిర్జలీకరణకు
గురికాకుండా ఆరోగ్యంగా చూడటం.
గ్రామీణ
సురక్షిత త్రాగు నీటి పధకం:
దీనిలో
భాగంగానే ఓవర్ హెడ్ ట్యాంక్ లను నిర్మిస్తారు.
దీని
ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని గ్రామీణ నీటి సరఫరా పధకం ద్వారా ప్రతి ఇంటికి అందిస్తారు.
చేరువులోని
నీటిని శుద్ధి చేయు దశలు:
తేర్చుట(బరువైన పదార్థాలు క్రిందికి
చేరుతాయి)
వడపోత(చిన్న పదార్దాలు
తొలగించబడతాయి)
క్లోరినషన్(బిలీచింగ్ పౌడర్ చేరుస్తారు, సూక్ష్మ జీవులు చంపబడతాయి)
తర్వాత
ఓవర్
హెడ్ ట్యాంకులుకు చేరుస్తారు ఆపై.
పైప్ ల ద్వారా ప్రతి ఇంటికి
చేరుస్తారు.
నీరు
అవిరిగా మారె ప్రక్రీయ భాష్పీభవనం.
నీటి
చుక్కలు మేఘాలుగా క్రిందికి రావడాన్ని అవపేక్షం లేదా వర్షం
అంటారు.
నదులలో
నీరు నిల్వ చేయటానికి అనకట్టలు జలాశయాలు నిర్మిస్తున్నారు.
గోదావరి
నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ధవళేశ్వరం ప్రాజెక్ట్.
ధవళేశ్వరం
అనకట్టని నిర్మించినవారు సర్ ఆర్థర్ థామస్ కాటన్.
సర్
ఆర్థర్ థామస్ కాటన్ ఒక బ్రిటిష్ నీటి పారుదల
శాఖ ఇంజినీర్.
ధవళేశ్వరం
అనకట్టని దేని మధ్యలో నిర్మించారు తూర్పు గోదావరి (ధవళేశ్వరం), పశ్చిమగోదావరి (విజ్జేశ్వరం) మధ్యలో
నిర్మించారు.
కృష్ణ
నది పై నిర్మించిన బహుళార్ధ సాధక నిర్మాణాలు నాగార్జున సాగర్, శ్రీశైలం ఆనకట్టలు.
కృష్ణ
నది జన్మ స్థలం పశ్చిమ కనుమలలోని
మహాభళేశ్వరం.
కృష్ణ
నది పొడవు 1400km.
కృష్ణ
నదికి ఇంకో పేరు కృష్ణవేణి నది.
మన
రాష్ట్రంలో కృష్ణ నది ఎక్కడ ప్రవహిస్తుంది కర్నూల్, గుంటూరు.
కృష్ణ
నది చివరిగా ఎక్కడ కలుస్తుంది హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
నాగార్జున
సాగర్ ఆనకట్ట ఎప్పుడు నిర్మించబడింది 1967.
నాగార్జున
సాగర్ ఆనకట్ట దీనిపై నిర్మించబడింది కృష్ణ నదిపై.
నాగార్జున
సాగర్ ఎక్కడ నిర్మించబడింది AP గుంటూరు జిల్లా నాగార్జున
కొండ, తెలంగాణ నల్గొండ జిల్లా మధ్యలో నిర్మించబడింది.
నాగార్జున
ఆనకట్ట కి రెండు కాలువలు ఉన్నాయి.
కుడివైపు
కాలువ జవహర్ కాలువ.
ఎడమ
వైపు కాలువ లాల్ బహదూర్ కాలువ.
ప్రకాశం
బ్యారేజి ఎక్కడ నిర్మించారు కృష్ణ జిల్లా విజయవాడలో కృష్ణ నదిపై నిర్మించారు.
ప్రకాశం
బ్యారేజ్ పొడవు 1.2km.
ప్రకాశం
బ్యారేజ్ ఏ జిల్లాల మధ్యలో విస్తరించి ఉంది కృష్ణ, గుంటూరు.
ప్రకాశం
బ్యారేజ్ శంకుస్థాపన 1954( శ్రీ ప్రకాశం పంతులు).
ప్రకాశం
బ్యారేజ్ ప్రారంభం 1957(శ్రీ నీలం సంజీవ రెడ్డి).
AP మొట్ట
మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం
పంతులు.
ఎన్ని
సంవత్సరాలు వర్షం కురవకపోతే కరువు కాలంగా పేర్కొంటారు 4-5 సంవత్సరాలు.
భారతదేశంలో
ఎంత భూభాగం కరువు ప్రాంతంగా పేర్కొనబడింది 68%.
కర్నూలులో వరదలు
సంబంధించిన సంవత్సరం - 2009 (300 అడుగులు ఎత్తు నీరు
తొలగించడానికి3 రోజులు పట్టింది).
2019 లో కృష్ణ నది పొంగటం వల్ల కృష్ణ, గుంటూరు జిల్లాలో
అనేక ప్రాంతాలు మునిగాయి.
వరదలు అధిక వర్షపాతం వల్ల
సంభవిస్తాయి.
ప్రపంచ
వ్యాంప్తంగా ఎంత మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులోలేదు 783 మిలియన్లు.
మానవ
శరీరానికి రోజుకి కావాల్సిన నీరు2-3 లీటర్లు.
1లీటరు=1000మిల్లి లీటర్లు.
మన
బరువులో ఎంత శాతం నీరు ఉంది 70%.
భూమిపై
లభించే నీటిలో మంచి నీటి శాతం 3%.
మంచు
గడ్డ నీటిపై తెలడానికి కారణం మంచు గడ్డ సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ
కావడం.
నీటి
ఆవిరి నీరుగా మారే ప్రక్రియ సాంద్రీకరణం.
వర్షం, మంచు, లేదా వడగండ్లు వంటివి ఆకాశం
నుండి పడే వాతావరణ స్థితిని ఏమంటారు అవపాతం.
నైరుతి
రుతుపవనాలు కాలం జూన్ నుండి సెప్టెంబర్.
ఈశాన్య
రుతుపవనాల కాలం నవంబర్, డిసెంబర్.
భూమి
ఉపరితలం నుంచి గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను ఏమంటారు జలచక్రం లేదా
హైడ్రాలోజికల్ వలయం.
జలచక్రంలోని
ముఖ్యమైన భాగాలు 4
1.భాష్పీభవనం
2.సాంద్రీకరణం
3.అవపాతం
4.సేకరణ
భాష్పీభవనం:ద్రవం వాయువు గా మారడం.
సాంద్రీకరణం:వాయువు ద్రవంగా మారడం.
అవపాతం:నీరు
లేదా గడ్డ కట్టిన నీరు భూమిపై పడటం.
సేకరణ:నీరు భూగర్భంలోకి ఇంకడం, ప్రవహించడం.
అవపాతంలో
రకాలు ప్రధానంగా 4
1.వర్షం
2.మంచు
3.మంచు
వర్షం
4.వడగళ్ళు
NDRF అనగా National disaster relief force ప్రకృతి వైపరీత్యాల సమయంలో NDRF రాష్ట్రా విపత్తు సహాయక దళం, స్థానిక
అగ్నిమాపక, ఆరోగ్య,రెవిన్యూ, పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయి.
జల
సంరక్షణ పద్ధతులు2
1.నీటి నిర్వహణ
2.వర్షపు
నీటి నిర్వహణ
ఒక
ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ మొదలైన పరిస్థితులను
ఏమంటారు వాతావరణం.
వేడిగాలులు
వలన అడవులు తగలబడిపోడాన్ని ఏమంటారు కార్చిచ్చు.
భూమి
వేడెక్కడాన్ని ఏమంటారు గ్లోబల్ వార్మింగ్.
చిప్కో
ఉద్యమం ఎప్పుడు జరిగింది 1970.
చిప్కో
అనగా హిందీ భాషలో అర్ధం
హత్తుకోవడం.
చిప్కో
ఉద్యమం దేనికోసం చేశారు అడవుల నరికివేతకు
వ్యతిరేకంగా చేశారు.
గ్రీన్
హౌస్ ఎఫెక్ట్ కి కారణం అయినవి క్లోరోఫ్లోరో కార్బన్లు, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోకార్బోన్లు.
ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న వాయువులు రిఫ్రిజిటర్, ఎయిర్ కండిషనర్ లు
విడుదల చేసే వాయువులు.
వర్షాకాలంలో
ధరించాల్సినవి కృత్రిమ ధరలతో తయారుచేసినవి
కారణం త్వరగా ఆరిపోతాయి.
Ex:పాలిస్టర్ట్ తో తయారుచేసిన
రెయిన్ కోట్స్.
వేసవి
కాలంలో ధరించాల్సినవి నూలు వస్త్రాలు.
చలికాలంలో
ధరించాల్సినవి ఉన్ని బట్టలు.
నూలు
గుడ్డ పాలిస్టర్ గుడ్డ కన్నా
మందంగా ఉంటుంది.
నూలు
గుడ్డలు మందంగా,బరువుగా ఉంటాయి.
ఉతికిన
తర్వాత నూలు బట్టలు ముడతలు పడి
కుంచించుకుపోతాయి.
పట్టుబట్టలు నున్నగా ఉంటాయి.
ఉన్ని
బట్టలు గరుకుగా మరియు బరువుగా ఉంటాయి.
బట్టలు
నేతలో ని దారాలు రెండు వరుసలో ఉంటాయి.
నిలువు
వరస పడుగు.
అడ్డు
వరుస పేక.
ఈ
రెండు వరసలు దారాలను కలిపి వస్త్రాలను తయారు చేస్తారు.
సన్నని
పీచుల వంటి వాటిని దారపు పోగులు అంటారు.
నూలు
దారాలు పత్తి పీచు దారాలతో తయారుచేస్తారు.
దారాలు
రకాలు రెండు.
1సహజ దారాలు
2కృత్రిమ
దారాలు
సహజ
దారాలు :మొక్కలు జంతువుల నుండి తయారయేవి.
Ex: పత్తి, జనము, పట్టు, ఉన్ని
కృత్రిమ
దారాలు:రసాయన పదార్థాలు తో
తయారుచేసినవి.
Ex:పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రలిన్
కృత్రిమ
వస్త్రాలు కలిస్తే వచ్చే వాసన ఘాటైనది.
పత్తి
కాయలోని దూదిలో గల సన్నని వెంట్రుకల వంటివాటిని ఏమంటారు పత్తి దారాలు లేదా పీచు
దారాలు.
పత్తి
కాయలు నుండి గింజలు తీసి దూదిని వేరు చేయడాన్ని ఏమంటారు జిన్నింగ్.
జిన్నింగ్
అనగా వేరుచేయడం.
పత్తి
పంట పండించే నేల నల్లరేగడి నేల.
ఒక
పత్తి కాయ నుండి లభించే దారం పొడవు 500మీ.
Ap లో
పత్తి విస్తారంగా పండే జిల్లాలు గుంటూరు, ప్రకాశం.
స్పిన్నింగ్
లేదా వడకడం అనగా దూది పీచు
ఉపయోగించి నూలు దారులను తయారు చేయడం.
దారాన్ని
వడకడానికి ఉపయోగించే పరికరాలు రాట్నం, చరఖా, తకిలి.
మగ్గాలు
అనగా నేత నేయడానికి ఉపయోగించే యంత్రాలు.
చేతితో
నేత నేయడానికి ఉపయోగించే మగ్గాలు- చేనేత మగ్గాలు.
విద్యుత్
సహాయంతో నడిచే నేత మగ్గాలు - మరమగ్గాలు పవర్ లూమ్.
పత్తి
కాయ నుండి వస్త్రం వరకు గల క్రమం
పత్తి
కాయ
జిన్నింగ్
నూలుపోగు
శుభ్రపరచడం
కడగడం
దువ్వటం
వడకడం
దారం
నేయడం
వస్త్రం
చేనేత
పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు
ఉప్పాడ
మంగళగిరి
వెంకటగిరి
ధర్మవరం
పొందూరు
చీరాల
కలంకారి
అనేది-చేతి
ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ.
కలంకారి
కి ప్రసిద్ధి చెందినది- మచిలీపట్నం.
తివాచీ
పరిశ్రమకు ప్రసిద్ధి –మచిలీపట్నం.
జనము
మొక్కల కాండం నుండి తయారుచేసేవి జనము దారాలు.
బంగారు
దారం అని దేనిని అంటారు జనపనారను.
జనము
దారాలు స్వభావం గట్టితనం, గరుకుతనం.
గోనెసంచీల
తయారీ జనము దారాలు.
భారత
దేశంలో జనపనార పంట అత్యధికంగా
పండించే రాష్ట్రాలు 7.
1.ఉత్తరప్రదేశ్
2.త్రిపుర
3.మేఘాలయ
4.పశ్చిమబెంగాల్ (50%పైగా పండిస్తున్నారు)
5.అస్సాం
6.బీహార్
7.ఒడిశా
జంతువుల
వెంట్రుకలను ఏమంటారు ఉన్ని ,ప్లీస్ లేదా ఫర్.
ఉన్ని
అనేది ఒక అధమ ఉష్ణ వాహకం.
పట్టు
అనేది ఒక ప్రోటీన్.
పట్టు
పురుగులను పెంచి వాటినుండి పట్టు తీయడాన్ని ఏమంటారు పట్టు వర్ధనం.
పట్టు
కాయ నుండి పట్టు దారాన్ని తీయడాన్ని ఏమంటారు రీలింగ్.
పట్టు
కీటకం యొక్క గుడ్లను ఏమంటారు విత్తనాలు.
పట్టుపురుగు
మల్బరీ ఆకులు తింటూ దేనిగా మారుతుంది కకూన్.
కొబ్బరిపీచు పరిశ్రమ ప్రధానంగా ఏ
రాష్జ్రాలలో ఉంది.
కేరళ
తమిళనాడు
కర్ణాటక
ఆంద్రప్రదేశ్
ఒడిశా
గ్రామీణ
ప్రాంతాల్లో ఎంత మందికి చేతివృతుల వారికి కొబ్బరిపీచు పరిశ్రమ ఆదాయం కల్పిస్తుంది 5లక్షల మందికి.
ఎంత
శాతం మంది మహిళలు కొబ్బరిపీచు పరిశ్రమలో కార్మికులుగా ఉన్నారు 80%.
వేటిని
పెంచటానికి కొబ్బరిపీచుని ఒక ఆధార పదార్థం గా ఉపయోగిస్తారు పుట్టగొడులు.
ఆంద్రప్రదేశ్
చేనేత సహకార సంఘం యొక్క గుర్తు Apco (ఆప్కో).
పత్తి
అనేది ఒక సెల్యులోజ్ కార్బోహైడ్రేట్.
రేయాన్
అనేది ఒక సెల్లులోజ్ తో తయారుచేబడ్డ ఒక కృత్రిమ దారం.
మిశ్రమ
దారాలకు ఉదాహరణ టేరికాటన్,టేరిఊలు.
పూల
దుకాణంలో పూలదండను కొలవటానికి ఉపయోగించేది కొలత మూర.
చిన్న
వస్తువులు కొలవడానికి ఉపయోగించే కొలత కొలబద్ద.
గది
యొక్క పొడవు ,వెడల్పు,ఎత్తు లను కొలవటానికి
ఉపయోగించే కొలత టేపు.
కొలబద్దలో
ఒకవైపు cm, mm అయితే మరోవైపు అంగుళాలు కొలతలు ఉంటాయి.
ఒక
గజం =3 అడుగులు.
ఒక
అడుగు=12 అంగుళాలు.
ఒక
అంగుళం=2.54cm.
అంతర్జాతీయంగా
పొడవులను కొలవటానికి ఆమోదించిన పరికరం మీటర్ స్కేల్.
(ఫ్రాన్స్ లోని సీవర్స్ నది ఒడ్డున
గల మ్యూజియం లో
భద్రపరచబడిన ప్లాటినం-ఇరిడియం లోహకడ్డీ
పొడవునే ఒక మీటర్ గా తీసుకున్నారు).
నాణెం
మందం=స్కేలుపై
నాణెముల ఎత్తు (మందం)/మొత్తం నాణెముల ఎత్తు.
ఘన
పదార్దాలు అనగా పాత్రను బట్టి స్వభావాన్ని మార్చుకోలేనివి.
ఘన
పదార్దాలకు ఉదాహరణ రాయి, ఇటుక, చెక్క.
ద్రవ
పదార్థాలు అనగా పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోలేనివి.
ద్రవ
పదార్దాలకు ఉదాహరణ నూనె,పెట్రోల్, కిరోసిన్,జ్యూస్,పంచదార నీరు,పాలు.
వాయు
పదార్థాలు అనగా నిర్దిష్ట ఆకారం మరియు నిర్దిష్ట ఘనపరిమానం లేనివి.
ఉత్పతనం అనగా ఘన
స్థితి నుండి నేరుగా వాయుస్థితికి మారే పక్రియ.
ఉత్పాతనానికి
ఉదాహరణ కర్పూరం,డ్రై ఐస్.
నీటిపై
ఏ వస్తువులు తేలుతాయి నీటి సాంద్రత కన్నా తక్కువ
సాంద్రత గల వస్తువులు.
నీటి
కన్నా తక్కువ సాంద్రత గల వస్తువులకు ఉదాహరణ కిరోసిన్,మంచుగడ్డ
విశ్వ
ద్రావణి అని దేనిని అంటారు నీరు(ఎక్కువ పదార్దాలను తనలో
కరిగించుకునే స్వభావం కలది కావున).
రెండు
లేదా అంతకన్నా ఎక్కువ సజాతి పదార్దాల మిశ్రమాన్ని ఏమంటారు ద్రావణం.
వేరువేరు
పదార్దాలతో ఏర్పడే వాటిని ఏమంటారు మిశ్రమం.
మిశ్రమాలు రెండు రకాలు.
1.సజాతీయ మిశ్రమాలు.
2.విజాతీయ
మిశ్రమాలు.
సజాతీయ
మిశ్రమాలు అనగా సాధారణ వడపోత
పద్ధతులు ద్వారా వేరుచేయలేనివి.
సజాతీయ
మిశ్రమాలకి ఉదాహరణ ఉప్పు నీరు, చెక్కర నీరు.
విజాతీయ
మిశ్రమాలు అనగా సాధారణ వడపోత పద్ధతుల
ద్వారా వేరు చేయగలిగినవి.
పదార్దాల పరిమాణం ,రంగులో తేడా ఆధారంగా వేరుచేసే
పద్దతి ని ఏమంటారు చేతితో ఏరివేయటం.
ఒక ద్రవంలో
గల కరగని ఘన పదార్థంను ఆధారంగా
వేరుచేసే పద్ధతి తేర్చుట లేదా వడపోత.
ద్రవంలో కరిగి ఉన్న ఘన పదార్దాన్ని వేరు
చేసే పద్ధతి ఇగుర్చుట లేదా స్పటికీకరణం.
బరువు
మరియు తేలికపాటి అంశాల ఆధారంగా వేరు చేసే పద్ధతి తూర్పారబెట్టడం.
మిశ్రణీయ
ద్రవాల భాష్పీభవన ఉష్ణోగ్రతలో తేడా25℃ కన్నా ఎక్కువ ఉండే
వాటిని వేరు చేసే పద్ధతి స్వేదనం.
స్వేదనం
అనగా మలీన రహితమైన నీరు.
స్వేదన
జలం అనగా స్వచ్ఛమైన నీరు.
మిశ్రణీయ
ద్రవాల భాష్పీభవన ఉష్ణోగ్రతలో తేడా25℃ కన్నా తక్కువ ఉండే
వాటిని వేరు చేసే పద్ధతి అంశిక స్వేదనం.
టీ
పొడిని, టీ డికాక్షన్ నుండి
వేరు చేయడానికి వాడే పరికరం సిబ్బి గరిటి.
రంగుల
మిశ్రమం నుండి రంగులని వేరు చేసే పద్దతి క్రోమాటోగ్రఫి.
బియ్యంలో
రాళ్లు చేతితో ఏరివేయడం.
టీ
లేదా కాఫీ వడపోత.
మట్టి
నీరు నుండి నీరు తేర్చుట లేదా వడపోత.
ఉప్పునీటి
నుండి ఉప్పు ఇగుర్చుట లేదా స్పటికీకరణ.
స్వచ్ఛమైన
నీటిని పొందే పద్ధతి స్వేదనం.
పెట్రోలియం
నుండి 5 లక్షల వివిధ
అంశీబుతాలను వేరు చేయటం అంశిక స్వేదనం.
కర్పూర
వృక్షం చెట్టు బెరడు నుండి కర్పూరం తయారు చేయడం స్వేదనం.
కాంతి
ఇచ్చే వస్తువులను ఏమంటారు కాంతి జనకం.
కాంతిని
గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఆప్టిక్స్.
కాంతిని
కొలుచు శాస్త్రం ఫోటోమెట్రి.
కాంతి
జనకాలు ఎన్ని రకాలు రెండు.
1.స్వయం ప్రకాశకాలు.
2.గౌణ
ప్రకాశకాలు/పర ప్రకాశకాలు.
స్వయం
ప్రకాశకాలకి ఉదాహరణ సూర్యుడు, నక్షత్రాలు, మిణుగురు పురుగులు.
గౌణ
ప్రకాశకాలకి ఉదాహరణ గ్రహాలు ఉపగ్రహాలు.
నీడ
అనగా అర్థం కాంతి లేని ప్రదేశం.
కాంతిని
తమగుండా ప్రసరింపచేసే పదార్దాలను ఏమంటారు పారదర్శక పదార్దాలు.
పారదర్శక
పదార్దాలకు ఉదాహరణ నీరు,గాజు, శూన్యం.
కాంతిని
తమగుండా ప్రసంపనీయని పదార్దాలను ఏమంటారు అపారదర్శక పదార్దాలు/కాంతి
నిరోధకపదార్దాలు.
అపారదర్శక
పదార్దాలకు ఉదాహరణ కాగితం, చెక్క.
కాంతిని
తమ గుండా పాక్షికంగా లేదా స్వల్పంగా ప్రసరింపచేసే పదార్దాలను పాక్షిక పారదర్శక
పదార్దాలు అంటారు.
పాక్షిక
పారదర్శక పదార్దాలకు ఉదాహరణ నూనె పూసిన కాగితం,మైనం.
కాంతి
ఎల్లప్పుడూ ఏ తరంగ రూపంలో ప్రయాణిస్తుంది విద్యుదాయస్కాంత తరంగ రూపం.
కాంతి
ఏ మార్గంలో ప్రయాణిస్తుంది ఋజుమార్గంలో.
పిన్
హోల్ కెమెరా గుండా ఎటువంటివస్తువల్ని చూడగలం పెద్ద వస్తువులను.
పిన్
హోల్ కెమెరా తెరపై ఏర్పడే ప్రతిబింబం ఏ విదంగా ఏర్పడుతుంది తలక్రిందులుగా.
పిన్
హోల్ కెమెరా తెరపై ఏర్పడే ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడటానికి కారణం కాంతి ఋజుమార్గ ప్రయాణం.
ఏదైనా
వస్తువు పై పడిన కాంతి, తిరిగి వెనకకు మళ్లాడాన్ని
ఏమంటారు పరావర్తనం.
చంద్రుడిపై
పడిన కాంతి పరావర్తనం చెంది భూమిని చేరటానికి పట్టు కాలం ఎంత 1సెకను.
వస్తువుల
తలములపై పడిన కాంతి వెనకకు అదే యానకంలో తిరిగి రావడమే కాంతి పరావర్తనం.
నునుపు
తలంపై ఏర్పడే కాంతి పరావర్తనం క్రమ పరావర్తనం.
గరుకు
తలంపై ఏర్పడే కాంతి పరావర్తనం క్రమరహిత పరావర్తనం.
సూర్యునికి, భూమికి మధ్యలో చంద్రుడు
వచ్చినపుడు చంద్రుని నీడ భూమి పై పడి ఏర్పడే గ్రహణం సూర్య గ్రహణం.
సూర్యునికి, చంద్రునికి మధ్యలో భూమి వచ్చినపుడు భూమి
నీడ చంద్రునిపై పడి ఏర్పడే గ్రహణం చంద్ర గ్రహణం.
చంద్రగ్రహణం
ఏ రోజుల్లో మాత్రమే ఏర్పడుతుంది పౌర్ణమి రోజుల్లో మాత్రమే.
విద్యుత్
శక్తిని రసాయన శక్తి రూపంలో నిల్వ చేసి, అవసరమైనప్పుడు తిరిగి విద్యుత్ శక్తి రూపంలో
అందజేయు ఏర్పాటును ఏమంటారు ఘటం.
ఘటాన్ని
మొదటగా కనుగొన్న శాస్త్రవేత్త అలెసాండ్రో వోల్టా(1800).
ఘటంలో
ఉండే ప్రాధమిక భాగాలు3
1.ధన
ఎలక్ట్రోడ్ (ఆనోడ్)
2.ఋణ
ఎలెక్ట్రోడ్ (కేథోడ్)
3.విద్యుత్
విశ్లేష్యం(ఎలెక్ట్రోలైట్)
విద్యుత్
బుల్బ్ ని కనుగొన్నవారు థామస్ అల్వా ఎడిసన్.
బుల్బ్
లోని వెలిగే భాగాన్ని ఏమంటారు ఫీలమెంట్.
విద్యుత్ వలయాన్ని మూసి లేదా తెరవడానికి
ఉపయోగపడే పరికరం స్విచ్.
స్విచ్
కి మరియొక్క పేరు కీ.
వలయంలో
విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారు కరెంట్.
స్వేచ్చా
ఎలెక్ట్రాన్ల ప్రవహన్నీ ఏమంటారు కరెంట్.
కరెంట్
యొక్క ప్రమాణం ఆంపియర్.
వలయంలోని
విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు అమీటర్.
విద్యుత్
ప్రవాహ పరంగా పదార్దాలు ఎన్ని రకాలు 4
1.విద్యుత్ వాహకలు
2.విద్యుత్
బంధకలు
3.అర్ధవాహకలు
4.అతి
వాహకలు
తమగుండా
విద్యుత్ ని ప్రసరింపచేసేవాటిని ఏమంటారు విద్యుత్ వాహకలు.
విద్యుత్
వాహకాలకి ఉదాహరణ మానవ శరీరం,ఇనుము, రాగి, అల్యూమినియం, వెండి, గ్రాఫైట్, మలీనమైన నీరు.
ఉత్తమ
విద్యుత్ వాహకం వెండి.
వెండి
తర్వాత ఉత్తమ విద్యుత్ వాహకం గ్రాఫైట్.
తమ
గుండా విద్యుత్ ని ప్రసరింపచేయని
వాటిని ఏమంటారు విద్యుత్ బంధకాలు.
విద్యుత్
బంధకాలకు ఉదాహరణ వజ్రం, స్వచ్ఛమైన నీరు,ప్లాస్టిక్, గాజు, రబ్బర్.
ఉత్తమ
విద్యుత్ బంధకం వజ్రం.
ఉత్తమ
ఉష్ణ వాహకం మరియు ఉత్తమ విద్యుత్ బంధకం కి మంచి ఉదాహరణ అబ్రకం( మైకా).
ఎలెక్ట్రానిక్
పరికారాలలో తీగలను అతికించడానికి ఉపయోగించే గన్ సోల్డరింగ్ గన్.
నూతన
విద్యుత్ కుంపటి, స్విచ్ లను ఏ విద్యుత్ బంధక
పదార్దాలతో తయారుచేస్తారు ఎబోనైట్.
తమ
గుండా విద్యుత్ ను పాక్షికంగా ప్రసరింపచేసే పదార్దాలను ఏమంటారు అర్ధ వాహకాలు.
అర్ధ
వాహకాలకి ఉదాహరణ సిలికాన్, జెర్మేనియం.
లోహమును
చలబర్చినపుడు ఒక అల్ప ఉష్ణోగ్రత వద్ద వాటి నిరోధం శూన్యం అయి విద్యుత్ ప్రవాహం
నష్టం లేకుండా నిర్ణతరాయంగా ప్రవహిస్తుంది ఈ ధర్మాన్ని
ఏమంటారు అతివాహకత.
అతివాహకత
కి ఉదాహరణ అల్యూమినియం,మెగ్నీషియం డై బొరైడ్,.
పెన్సిల్
లో ఉన్న గ్రాఫైట్ దేనికి ఉదాహరణ విద్యుత్ వాహకత.
అతివాహకతని
కనుగొన్నవారు కామర్లింగ్ ఓన్స్(1911).
కామార్లిన్
ఓన్స్ కి అతివాహకత కనుగొన్నందుకు గాను ఏ సంవత్సరం లో నోబెల్ బహుమతి వచ్చింది 1913.
ఎడిసన్
తన జీవితకాలంలో సుమారుగా ఎన్ని ఆవిష్కరణలు చేశారు 1000కి పైగా.
ఎడిసన్
చివరిగా దేనిని ఫిలమెంట్ గా ఉపయోగించారు దూది.
ఎడిసన్
దేనిని ఫిలమెంట్ గా వాడినపుడు అది నిరంతరాయంగా 45 గంటలు పాటు వెలిగింది మసి పూసిన నూలు దారం.
ఎడిసన్
మొదటగా ఏ సన్నని దారం గుండా విద్యుత్ ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతిని ఇవ్వడం
గమనించాడు ప్లాటినం తీగ.
టoగ్స్టన్ ద్రవీభవన స్థానం 3422℃.
విద్యుత్
వలయంలో పరిమితిని మించిన పరిమాణంలో విద్యుత్ ప్రవహించు సందర్భమును ఏమంటారు ఓవర్ లోడ్.
ఓవర్
లోడ్ వల్ల కలిగే ప్రమాదాన్ని దీనిద్వారా నివారించవచ్చు ఫ్యూజ్ ను వాడటం
ద్వారా
ఆధునిక
కాలంలో ఫ్యూజ్ కి బదులుగా దేనిని వాడుతున్నారు MCB.
పదార్థంలో
పరమాణు ఎలెక్ట్రాన్ లు ఒక క్రమమైన పద్దతిలో అమర్చబడి ఉన్నట్లయితే కలిగే ఆకర్షణ
శక్తిని ఏమంటారు అయస్కాంతత్వం.
అయస్కాంతాన్ని
మొదటగా ఏ ప్రదేశంలో కనుగొన్నారు మెగ్నీషియా.
ఎన్ని
సంవత్సరాల క్రితం అయస్కాంతం కనుగొనబడింది 2500 సంవత్సరాల క్రితం.
ఎవరిచేత
అయస్కాంతం కనుగొనబడింది మాగ్నాస్ అనే బాలుడు చే (మాగ్నాస్
పేరున ఆ శిలలకు మాగ్నెట్ అని దాని ధాతువుకి మాగ్నాటాయిట్ అని పేరు పెట్టారు).
అయస్కాంతాలు
ఎన్ని రకాలు 2.
1సహజ
అయస్కాంతాలు 2.కుత్రిమ అయస్కాంతాలు.
సహజ
అయస్కాంతాలు అనగా ప్రకృతిలో లభించి ఆకర్షణ
ధర్మం కలిగినవి.
సహజ
అయస్కాంతాలు నిర్దిష్టమైన ఆకారం ఉండదు.
సహజ
అయస్కాంతాలు వేటీకి ఉపయోగపడతాయి దిశలు కనుకోవడానికి (కాబట్టి
వీటిని లీడింగ్ స్టోన్స్ లేదా
లోడ్ స్టోన్స్ అంటారు.
కృత్రిమ
అయస్కాంతాలు అనగా మానవ నిర్మిత అయస్కాంతాలు లేదా సహజ అయస్కాంతాల సహాయంతో
ఏర్పడేవి.
కృత్రిమ
అయస్కాంతాలు ఎన్ని రకాలు2.
1. శాశ్వత అయస్కాంతాలు 2. తాత్కాలిక అయస్కాంతాలు.
శాశ్వత
అయస్కాంతాలు అనగా ఒక పద్ధతి ద్వారా
అయస్కాంతీకరించబడిన తరువాత, అయస్కాంతత్వాన్ని శాశ్వతంగా
ఉంచుకోగలిగేవి.
శాశ్వత
అయస్కాంతలుకు ఉదాహరణ దండయస్కాంతం,స్థూపాకర అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం, గుఱ్ఱపునాడ అయస్కాంతం, వలయాకారపు
అయస్కాంతం, సూది అయస్కాంతం, అండాకారపు అయస్కాంతం.
తాత్కాలిక
అయస్కాంతం అనగా అయస్కాంతం యొక్క తీగ
చుట్టులో విద్యుత్ ప్రవహించినంతసేపు మాత్రమే అయస్కాంతత్వం చూపించేవి.
తాత్కాలిక
అయస్కాంతాలు కి ఉదాహరణ విద్యుదయస్కాంతాలు.
అయస్కాంతత్వాన్ని
బట్టి పదార్థాలు ఎన్ని రకాలు2.
1.అయస్కాంత పదార్దాలు 2.అనాయస్కాంత పదార్థాలు.
అయస్కాంత
పదార్థాలు అనగా అయస్కాంతములచే
ఆకర్షించబడేవి.
అయస్కాంత
పదార్దాలుకు ఉదాహరణ ఇనుము, ఉక్కు, నికెల్, స్టీల్, కోబాల్ట్.
అనయస్కాంత
పదార్థాలు అనగా అయస్కాంతాల చే
ఆకర్షించబడనివి.
అనయస్కాంత
పదార్దాలకు ఉదాహరణ ప్లాస్టిక్ స్కేల్,పెన్సిల్,పేపర్,అల్యూమినియం, గోల్డ్.
అయస్కాంత
ధర్మాలు అయస్కాంత దృవాల సిదాంతం,అయస్కాంత దిశా ధర్మం, అయస్కాంత ప్రేరణ ధర్మం.
ఒక
అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నపుడు అది కూడా అయస్కాంత ధర్మాన్ని
చూపడాన్ని ఏమంటారు అయస్కాంత ప్రేరణ.
అయస్కాంత
పదార్థాములను ఆయస్కాంతములుగా మార్చు
ప్రక్రియను ఏమంటారు అయస్కాంతీకరణం.
అయస్కాంతీకరణ
పద్ధతులు ఎన్ని 5
1.ఏక స్పర్శ పద్ధతి
2.ద్వి
స్పర్శ పద్ధతి
3.విద్యుత్
పద్ధతి
4.భూ
అయస్కాంతీకరణ పద్ధతి
5.అయస్కాంత
ప్రేరణ పద్ధతి
నిరయస్కాంతీకరణ అనగా అయస్కాంత ధర్మాలను
కోల్పోవడం.
ఒక
వస్తువుని దండయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి, రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువుని
దేనిగా చెప్పవచ్చు అయస్కాంతంగా చెప్పవచ్చు.
దండయస్కాంతలను
ఏ విధంగా భద్రపరచాలి.
వాటి
విజాతి ధ్రువాలు ఒకే వైపున ఉండేలా ఉంచాలి రెండిటి మధ్యలో చెక్కముక్కను ఉంచాలి
రెండు చివరలా మృదువైన ఇనుప ముక్కలను ఉంచాలి.
వైద్యరంగంలో
ఏ మిషన్లలో అయస్కాంతాన్ని ఉపయోగిస్తారు MRI స్కాన్ లో ఉపయోగిస్తారు.
విద్యుత్
అయస్కాంత రైలును ఏమంటారు సస్పెన్షన్ రైల్ లేదా ఎగిరే రైలు.
ఒక
ఇనుప కడ్డీని అయస్కాంతీకరించినపుడు దాని పొడవు స్వల్ప పరిమాణం పెరుగుతుంది దీనిని
ఏమంటారు అయస్కాంత విరూపణ.
అయస్కాంత విరూపణ దేనిలో ఉపయోగిస్తారు అతిధ్వనుల ఉత్పాదనలో ఉపయోగిస్తారు.
0 Comments