6th class new telugu textbook guide important kaviparichayalu 2022

EDUCATIONALZONE
educationalzone.online

ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా 6th class new telugu text book ఆరవ తరగతి లోని ముఖ్యమైన కవిపరిచయాలను నేర్చుకోవడం జరుగుతుంది 6th class new important kaviparichayalu  

6th class telugu guide 2022,6th class new telugu text book 2022,6th class telugu study material

6th class telugu guide/study material 2022

అమ్మ ఒడి పాఠం రచయిత బి వి నరసింహారావు గారు
అమ్మ ఒడి పాఠం ఇతివృత్తం తల్లి ప్రేమ
అమ్మ ఒడి పాఠం ప్రక్రియ గేయం
తృప్తి పాఠం రచయిత సత్యం శంకరమంచి
తృప్తి పాఠం ఇతివృత్తం మానవ విలువలు
తృప్తి పాఠం ప్రక్రియ కథానిక
మాకొద్దీ తెల్ల దొరతనము పాట రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ గారు
మాకొద్దీ తెల్ల దొరతనము పాఠం ఇతివృత్తం దేశభక్తి
మాకొద్దీ తెల్ల దొరతనము పాఠం ప్రక్రియ గేయం
సమయస్ఫూర్తి పాఠం రచయిత కందుకూరి వీరేశలింగం గారు
సమయ స్ఫూర్తి పాఠం ఇతివృత్తం సమయస్ఫూర్తి
సమయస్ఫూర్తి పాఠం ప్రక్రియ కథ
మన మహనీయులు పాఠం రచయిత రచయితల బృందం
మన మహనీయులు పాఠం ఇతివృత్తం దేశభక్తి
మన మహనీయులు పాఠం ప్రక్రియ వ్యాసం
సుభాషితాలు పాఠం రచయిత శతక కవులు
సుభాషితాలు పాఠం ఇతివృత్తం నైతిక విలువలు
సుభాషితాలు పాఠం ప్రక్రియ శతక పద్యాలు
మమకారం పాఠం రచయిత చిలుకూరి దేవపుత్ర గారు
మమకారం పాఠం ఇతివృత్తం భాషాభిరుచి
మమకారం పాఠం ప్రక్రియ కథ
మేలుకొలుపు పాఠం రచయిత కుసుమ ధర్మన్న గారు
మేలుకొలుపు పాఠం ఇతివృత్తం సమానత్వం
మేలుకొలుపు పాఠం ప్రక్రియ పద్యం
ధర్మ నిర్ణయం పాఠం రచయిత సేకరణ
ధర్మ నిర్ణయం పాఠం ఇతివృత్తం స్థలపురాణం
ధర్మ నిర్ణయం పాఠం ప్రక్రియ చారిత్రక కథ
త్రిజట స్వప్నం పాఠం రచయిత కవయిత్రి మొల్ల గారు
త్రిజట స్వప్నం పాఠం ఇతివృత్తం సహానుభూతి
త్రిజట స్వప్నం పాఠం ప్రక్రియ పద్యం
డూ డూ బసవన్న పాఠం రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ గారు
డూ డూ బసవన్న పాఠ్య ఇతివృత్తం సంస్కృతి
డూ డూ బసవన్న పాఠ్య ప్రక్రియ జీవిత చిత్రం
ఎంత మంచి వారమ్మా పాఠం రచయిత వెన్నెలకంటి రాఘవయ్య గారు
ఎంత మంచి వారమ్మా పాఠం ఇతివృత్తం జీవన వైవిధ్యం
ఎంత మంచి వారమ్మా పాఠం ప్రక్రియ వ్యాసం
అమ్మ ఒడి పాఠం
అమ్మ ఒడి పాఠం రచయిత బాడిగ వెంకట నరసింహారావు గారు
అమ్మ ఒడి పాఠం ఇతివృత్తం తల్లి ప్రేమ
అమ్మ ఒడి పాఠం ప్రక్రియ గేయం
బాడిగ వెంకట నరసింహారావు గారి కవి పరిచయం
అమ్మ ఒడి పాట రచయిత బాడిగ వెంకట నరసింహారావు గారు
బాడిగ వెంకట నరసింహారావు గారి కాలం 1913 - 1994
బాడిగ వెంకట నరసింహారావు గారి జన్మస్థలం కౌతరం కృష్ణాజిల్లా
వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావు గా ఖ్యాతి గడించిన వారు బాడిగ వెంకట నరసింహారావు గారు
బాడిగ వెంకట నరసింహారావు గారు అనార్కలి నరసింహారావు బాలబంధు గా ప్రసిద్ధులు
బాడిగ వెంకట నరసింహారావు గారు రచించిన రచనలు
బాల రసాల
పాలబడి పాటలు
ఆవు హరిశ్చంద్ర
బాల తనం
చిన్నారి లోకం
పూల బాలలు
ఋతు వాణి వంటి 17 పిల్లల పుస్తకాలు రచించారు
బాలసాహిత్యాన్ని ఉద్యమస్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బీవీ నరసింహారావు గారు పెట్టుకున్నారు
అమ్మ ఒడి పాఠం బాలబంధు బాడిగ వెంకట నరసింహారావు గారి సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది
తృప్తి పాఠం
తృప్తి పాఠం రచయిత సత్యం శంకరమంచి గారు
తృప్తి పాఠం ఇతివృత్తం మానవ విలువలు
తృప్తి పాఠం ప్రక్రియ కథానిక
సత్యం శంకరమంచి గారు కవి పరిచయం
తృప్తి పాఠం రచయిత సత్యం శంకరమంచి గారు
సత్యం శంకరమంచి గారి కాలం 1937 - 1987
సత్యం శంకరమంచి గారి జన్మస్థలం అమరావతి గుంటూరు జిల్లా
సత్యం శంకరమంచి గారి నవలలు
అమరావతి కథలు
కార్తీక దీపాలు
కథాసంపుటాలు
రేపటి దారి
సీత స్వగతాలు
ఆఖరి ప్రేమ లేఖ
ఎడారిలో కలువ పూలు
హర హర మహాదేవ నాటకం
సత్యం శంకరమంచి గారు దినవార పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు
సత్యం శంకరమంచి గారు 1979 లో అమరావతి కథలకు అందుకున్న పురస్కారం రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం
తృప్తి పాఠం సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలోనిది
మాకొద్దీ తెల్ల దొరతనము పాఠం

మాకొద్దీ తెల్ల దొరతనము పాఠం రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ గారు
మాకొద్దీ తెల్ల దొరతనము పాఠ్య ఇతివృత్తం దేశభక్తి
మాకొద్దీ తెల్ల దొరతనము పాఠ్య ప్రక్రియ గేయం

గరిమెళ్ళ సత్యనారాయణ గారి కవి పరిచయం

గరిమెళ్ళ సత్యనారాయణ గారు కాలం 1893 - 1952
గరిమెళ్ళ సత్యనారాయణ గారి జన్మస్థలం నరసన్నపేట తాలూకా గోనెపాడు శ్రీకాకుళం జిల్లా
గరిమెళ్ళ సత్యనారాయణ గారు స్వాతంత్ర సమరయోధులు ,  కవి , రచయిత
గరిమెళ్ళ సత్యనారాయణ గారి రచనలు
స్వరాజ్య గీతములు 1921
హరిజనుల పాటలు 1923
ఖండకావ్యాలువ్1926
భక్తి గీతాలు
బాల గీతాలు
గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించిన గేయాలు
దండాలు దండాలు భారత మాత
మాకొద్దీ తెల్ల దొరతనము
దండాలు దండాలు భారత మాత , మాకొద్దీ తెల్ల దొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజలు సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ గారు
దేశభక్తి కవితలు రాసి జైలుశిక్షను అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు

సమయస్ఫూర్తి పాఠం

సమయస్ఫూర్తి పాఠం రచయిత కందుకూరి వీరేశలింగం గారు
సమయ స్ఫూర్తి పాఠం ఇతివృత్తం సమయస్ఫూర్తి
సమయస్ఫూర్తి పాఠం ప్రక్రియ కథ
కందుకూరి వీరేశలింగం గారి కవి పరిచయం
సమయస్ఫూర్తి పాఠ్య రచయిత కందుకూరి వీరేశలింగం గారు
కందుకూరి వీరేశలింగం గారి కాలం 1848 - 1919
కందుకూరి వీరేశలింగం గారి జన్మస్థలం రాజమండ్రి
కందుకూరి వీరేశలింగం గారి రచనలు
రాజశేఖర చరిత్రము
సత్యరాజా పూర్వ దేశ యాత్రలు
హాస్య సంజీవని
సతీహిత బోధిని
ఆంధ్ర కవుల చరిత్ర
కందుకూరి వీరేశలింగం గారి బిరుదు గద్య తిక్కన
సమయ స్ఫూర్తి అనే పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం గారు అనువదించిన పంచతంత్ర కథల లోని విగ్రహం అనే భాగం లోని కథ
మన మహనీయులు పాఠం
మన మహనీయులు పాఠం ఇతివృత్తం దేశభక్తి
మన మహనీయులు పాఠం ప్రక్రియ వ్యాసం
అమరజీవి పొట్టి శ్రీరాములు గారు
పొట్టి శ్రీరాములు గారి తల్లిదండ్రులు గురవయ్య , మహాలక్ష్మమ్మ
పొట్టి శ్రీరాములు గారి జననం 1901 మద్రాస్
పొట్టి శ్రీరాములు గారి భార్య సీతమ్మ
పొట్టి శ్రీరాములు గారి విద్యాభ్యాసం మద్రాసు బొంబాయి లో జరిగింది
గాంధీజీ బోధనలకు ఆకర్షితుడై స్వాతంత్ర ఉద్యమం వైపు నడిచిన వారు పొట్టి శ్రీరాములు గారు
పొట్టి శ్రీరాములు గారు ముంబైలో అసిస్టెంట్ ప్లంబర్ గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు
పొట్టి శ్రీరాములు గారు ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సబర్మతీ ఆశ్రమం లో చేరారు
రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని ఆరు నెలలు గాంధీతోపాటు పాటు జైలు శిక్ష అనుభవించారు
ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం , మద్యపాన నిషేధ ప్రచారం , నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టారు
ఆంధ్రులు , తమిళులు కలిసి ఒకే రాష్ట్రం ఉండడంవల్ల తెలుగు వారు అనేక ఇబ్బందులు పడటం వీరు గమనించారు
ప్రత్యేక రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు సమావేశాలు జరుగుతున్నాయి
పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కొరకు 1952 అక్టోబర్ 19న ఆదివారం అమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టి డిసెంబర్ 1511:30 నిమిషాలకు దీక్షలోనే ప్రాణాలు కోల్పోయారు
కర్నూలు రాజధానిగా 1- 10 -1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేశారు ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు
పింగళి వెంకయ్య గారు
జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు
పింగళి వెంకయ్య గారి జననం 1878 ఆగస్టు 2 న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు లో జన్మించారు
పింగళి వెంకయ్య గారు దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు
పింగళి వెంకయ్య గారికి 1906 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో బ్రిటిష్ జెండా ఎగరవేయడం నచ్చలేదు అందుకుగాను ఆయనకు రూపొందించాలని ఆలోచన వచ్చింది
1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారు జెండా ను రూపొందించి ఇవ్వమని అడగగా మూడు గంటల వ్యవధిలో రూపొందించి ఇచ్చారు
భారతీయులందరికీ స్పూర్తి కలిగించిన జెండా రూపకర్త అయినా ఆంధ్రుడు పింగళి వెంకయ్య గారు
పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది తర్వాత దాని స్థానంలో అశోక ధర్మ చక్రం చేర్చారు
నిరాడంబర జీవితం నిస్వార్థ సేవాతత్పరుడు గేయంగా బ్రతికిన పింగళి వెంకయ్య గారు 4-7-1963న స్వర్గస్తులయ్యారు

పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు
జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు
భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ దేశభక్తి అంతులేని జాతీయతా భావ చైతన్యాన్ని ఎనలేని సోదరభావాన్ని కలుగజేస్తుంది
1962లో భారత్ చైనా యుద్ధం తర్వాత మన దేశ విద్యార్థులు ప్రాథమిక దశ నుండి దేశ భక్తి భావం కలిగించాలనే ఉద్దేశంతో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు జాతీయ ప్రతిజ్ఞ రాశారు
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసిన తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు
1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయనిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞ స్వీకరించారు
1965 జనవరి 26 నుంచి భారతదేశమంతా అన్ని భాషల పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ చేర్పించారు
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు 1916లో నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో జన్మించారు
1965 జనవరి 26 నుండి అన్ని భాషలలో భారతదేశంలో పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ గేయాన్ని చేశారు
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు నల్గొండ జిల్లాలో అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10 తేదీన జన్మించారు
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి తల్లిదండ్రులు
వెంకటరామయ్య
రాంబాయమ్మ
1962 లో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు
బాల్యంలోనే తన తల్లి రామాయణ భారతాలు అని చెప్పేది బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి
పుస్తక సేకరణ పట్టణం , కవితా వ్యాసంగం , వేద అధ్యయనం చేసేవారు
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు భూస్వామ్య పద్ధతిలోని వెట్టిచాకిరీ నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించిన పద్య కావ్యాలు
దేవదత్తుడు
తులసీదాసు
త్యాగరాజు
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించిన రచనలు
బాల రామాయణం
వెంకటేశ స్తుతులు
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించిన నాటకాలు
గృహస్థ జీవితం
స్త్రీ ధర్మము
తార
శ్రీమతి

శంకరంబాడి సుందరాచారి గారు
సుందర కవిగా పేరు పొందిన వారు శంకరంబాడి సుందరాచారి గారు
శంకరంబాడి సుందరాచారి గారు ఉపాధ్యాయునిగా, ఆంధ్రాపత్రిక సంపాదకుడిగా ,పాఠశాలల పర్యవేక్షకునిగా పనిచేశారు.
శంకరంబాడి సుందరాచారి గారు రచించిన రచనలు
సుందర రామాయణం
సుందర భాగవతం
బలిదానం
అపవాదు
పేదకవి
నాస్వామి
నేటికవిత్వం
కావేటి నగర రాజ నీరాజనం
శ్రీనివాస శతకం
బుద్ధ గీత
సినిమా పాటలు రాసారు.
తెలుగు భాష, సంస్కృతి లపై అమితమైన అభిమానం తో జీవించనంతకాలం  వాటి పరిమళాలను తన కలంతో వెదజల్లిన కవి సుందరా చారి గారు
శంకరంబాడి సుందరాచారి గారి జననం 1914 ఆగష్టు 10 చిత్తూరు జిల్లా తిరుపతి లో జన్మించారు
మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీ లో విద్యాభ్యాసం చేశారు.
శంకరంబాడి సుందరాచారి గారు బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసం గా తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను సంస్కృతిని తెలుగు ప్రజలందరి పై నాలుకపై ధ్వనించే
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు అనే గేయం వ్రాసారు
శంకరంబాడి సుందరాచారి గారు ఆంధ్ర పత్రిక సంపాదకుడిగా పనిచేశారు
శంకరంబాడి సుందరాచారి గారు రచించిన రచనలు
సుందర రామాయణం
సుందర భాగవతం
బలిదానం
అపవాదు
పేద కవి
నా స్వామి
నేటి కవిత్వం
కావేటి నగర రాజ నీరాజనం
శ్రీనివాస శతకం
బుద్ధ గీత
2004 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి లో శంకరంబాడి సుందరాచారి గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది
సుభాషితాలు

సుభాషితాలు పాఠ్య రచయిత శతక కవులు
సుభాషితాలు పాఠ్య ఇతివృత్తం నైతిక విలువలు
సుభాషితాలు పాఠ్య ప్రక్రియ శతక పద్యాలు
నార్ల చిరంజీవి గారి శతకం తెలుగు పూలు
నార్ల చిరంజీవి గారి కాలం 20వ శతాబ్దం
వేమన గారి శతకం వేమన శతకం
వేమన గారి కాలం 17వ శతాబ్దం
కరుణశ్రీ గారి శతకం తెలుగు బాల శతకం
కరుణశ్రీ గారి కాలం 20వ శతాబ్దం
తిక్కన గారి శతకం మహాభారతం
తిక్కన గారి కాలం 13వ శతాబ్దం
పక్కి అప్పల నరసింహ గారి శతకం కుమారా , కుమారి శతకం
ఫక్కీ అప్పల నరసింహం గారి  కాలం 17వ శతాబ్దం
పోతులూరి వీర బ్రహ్మం గారి శతకం కాళికాంబ సప్తశతి
పోతులూరి వీరబ్రహ్మం గారి కాలం 17వ శతాబ్దం
మారద వెంకయ్య గారి శతకం భాస్కర శతకం
మారద వెంకయ్య గారి కాలం 16వ శతాబ్దం
కంచర్ల గోపన్న గారి శతకం దాశరధి శతకం
కంచర్ల గోపన్న గారి కాలం 17వ శతాబ్దం
పద్యాలు
భూమి నాది అన్న భూమి పద్య రచయిత వేమన
దొరలు దోచలేరు పద్య రచయిత కరుణశ్రీ
రోషావేశము జనులకు పద్య రచయిత పక్కి అప్పల నరసింహం
మరువ వలె గీడు, నెన్నడు మరవంగా రాదు మేలు పద్య రచయిత పక్కి అప్పల నరసింహం
పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు పద్య రచయిత పోతులూరి వీరబ్రహ్మం
సిరిగలవాని కెయ్యడల జేసిన మేలది నిష్ఫలంబగుంన్ పద్య రచయిత మారద వెంకయ్య
నోచిన తల్లిదండ్రికి దనోభవుడొక్కడె చాలు మేటి చే పద్య రచయిత కంచర్ల గోపన్న

మమకారం పాఠం
మమకారం పాఠ్య రచయిత చిలుకూరి దేవపుత్ర గారు
మమకారం పాఠ్య ఇతివృత్తం భాషాభి రుచి
మమకారం పాఠ్య ప్రక్రియ కథ
చిలుకూరి దేవపుత్ర గారి కవి పరిచయం
చిలుకూరి దేవపుత్ర గారి కాలం 24 - 4 - 1952 to 18 - 10 - 2016
చిలుకూరి దేవపుత్ర గారి జన్మస్థలం అనంతపురం జిల్లా కాల్వ పల్లె
చిలుకూరి దేవపుత్ర గారి కధా సంపుటాలు
ఏకాకీ నౌక చప్పుడూ
చివరి మనుషులు
బందీ
వంకరటింకర
ఆరు గ్లాసులు
చిలుకూరి దేవపుత్ర గారు రచించిన నవలలు
అద్దంలో చందమామ
పంచమం
చిలకూరి దేవపుత్ర గారు అందుకున్న పురస్కారాలు
1996
లో పంచమం నవలకు ఆటా ( అమెరికా తెలుగు అసోసియేషన్) వారి నవలల పోటీలో తృతీయ బహుమతి , 2000 సంవత్సరంలో పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం,2001 లో చా. సో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం
మమకారం పాఠం చిలుకూరు దేవపుత్ర రచించిన ఆరుగ్లాసులు అనే కథా సంపుటిలోనిది
మమకారం పాఠం లోని పాత్రల పేర్లు
రాజు (కథకుడు)
సుగుణ రాధా (సీత చెల్లెలు)
సీతా (రాజు భార్య)
సత్యం( రాజు స్నేహితుడు)
బుజ్జి చిన్న( సత్యం కొడుకులు)
మేలుకొలుపు

మేలుకొలుపు పాఠం రచయిత కుసుమ ధర్మన్న గారు
మేలుకొలుపు పాఠం ఇతివృత్తం సమానత్వం
మేలుకొలుపు పాఠం ప్రక్రియ పద్యం
కుసుమ ధర్మన్న గారి కవి పరిచయం
మేలుకొలుపు పాట రచయిత కుసుమ ధర్మన్న గారు
కుసుమ ధర్మన్న గారి కాలం 1900 - 1946
కుసుమం ధర్మనగారి జన్మస్థలం రాజమహేంద్రవరం లోని లక్ష్మీవారపు పేట
కుసుమ ధర్మన్న గారి తల్లిదండ్రులు
కుసుమ నాగమ్మ
వీరస్వామి
కుసుమ ధర్మన్న గారు వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్రము, ఆంగ్లం, హిందీ, ఉర్దూ లలో పాండిత్యం గలవారు
కుసుమ ధర్మన్న గారు రచించిన రచనలు
నిమ్న జాతి ముక్తి తరంగిని
నల్ల దొరతనం
హరిజన శతకం
మాకొద్దీ నల్ల దొరతనం
మద్యపాన నిషేధం
అసుర పురాణం పద్యకావ్యం
అంటరాని వాళ్ళం
దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకి వచ్చి తిరిగి ఆ చదువులు తన జాతి మేలు కోసం వచ్చిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల లో ఒకరు కుసుమ ధర్మన్న గారు
చదువుకున్న రోజుల్లోనే సంఘసంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం గారి  చేత ప్రభావితం అయ్యారు కుసుమ ధర్మన్న గారు.
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలి తరం తొలి దళిత కవి కుసుమ ధర్మన్న గారు.
మేలుకొలుపు పాఠం కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం నుండి గ్రహింపబడినది
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో పాట రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు
రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కాలం 07/05/1861 to 07/08/1941
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వకవి , చిత్రకారుడు , సంగీత కర్త , విద్యావేత్త
బెంగాలీ ఇంగ్లీషులో అన్ని సాహిత్య ప్రక్రియలను విస్తృతంగా రచనలు చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913 లో ఆయన రచించిన గీతాంజలి కి నోబెల్ సాహిత్య బహుమతి పొందారు
రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచనలు  గీతాంజలి
జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేల్కొలిపిన మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో కవిత గీతాంజలి లోనిది
గుడిపాటి వెంకటాచలం గారు
గుడిపాటి వెంకట చలం గారి కాలం 18 /05/1894 to 04/05/1979
గుడిపాటి వెంకటాచలం గారు కవి , కథారచయిత , నవలాకారుడు , నాటకకర్త , వ్యాసకర్త
తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత గుడిపాటి వెంకట చలం గారు
స్త్రీ స్వేచ్ఛ గురించి సమానత్వాన్ని గురించి పరితపించారు గుడిపాటి వెంకట చలం గారు
ఉపాధ్యాయుడిగా పాఠశాల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు గుడిపాటి వెంకటాచలం గారు
గుడిపాటి వెంకట చలం గారు విద్యను పెంపకాన్ని మేళవించి వలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు
ధర్మ నిర్ణయం
ధర్మ నిర్ణయం పాఠం రచయిత సేకరణ
ధర్మ నిర్ణయం పాఠం ఇతివృత్తం స్థలపురాణం
ధర్మ నిర్ణయం పాఠం ప్రక్రియ చారిత్రక కథ
త్రిజట స్వప్నం పాఠం

త్రిజట స్వప్నం పాఠం రచయిత కవయిత్రి మొల్ల గారు
త్రిజట స్వప్నం పాఠం ఇతివృత్తం సహానుభూతి
త్రిజట స్వప్నం పాఠం ప్రక్రియ పద్యం
ఆతుకూరి మొల్ల గారు
ఆతుకూరి మొల్ల గారి కాలం 16వ శతాబ్దం
ఆతుకూరి మొల్ల గారి జననం కడప జిల్లాలోని గోపవరం
ఆతుకూరి మొల్ల గారు రామభక్త కవియత్రి
ఆతుకూరి మొల్ల గారు రచించినది మొల్ల రామాయణం
మొల్ల రామాయణం లో 871 గద్య పద్యాలు ఉన్నాయి
ఆత్కూరి మొల్ల  గారు స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు
తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవియత్రి ఆతుకూరి మొల్ల గారు
త్రిజట స్వప్నం అనే పాఠం మొల్ల రాసిన రామాయణం లోని సుందరకాండ లోనిది
డూ డూ బసవన్న పాఠం
డూ డూ బసవన్న పాఠం రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ గారు
డూ డూ బసవన్న పాఠ్య ఇతివృత్తం సంస్కృతి
డూ డూ బసవన్న పాఠ్య ప్రక్రియ జీవిత చిత్రం
రావూరి భరద్వాజ గారి కవి పరిచయం
రావూరి భరద్వాజ గారి కాలం 05/07/1927 to 18/10/2013
రావూరి భరద్వాజ గారి జన్మస్థలం గుంటూరు జిల్లా , తాడికొండ
రావూరి భరద్వాజ గారి తొలి కథ విమల
రావూరి భరద్వాజ గారి రచనలు
అపరిచితులు , కధా సాగరము వంటి 37 కథా సంపుటాలు
ఉడతమ్మ ఉపదేశం , కీలుగుర్రం వంటి 43 పిల్లలకథలు
కరి మ్రింగిన వెలగ పండు , జలప్రళయం వంటి 17 నవలలు రాశారు
రావూరి భరద్వాజ గారు రచించిన పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది
రావూరి భరద్వాజ గారు అందుకున్న పురస్కారాలు
కళాప్రపూర్ణ
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం
రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు
గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం
కళారత్న (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం
డు డు బసవన్న పాఠం  జీవన సమరం అనే వ్యథార్థ జీవుల యదార్థ గాధల పుస్తకం నుండి తీసుకోబడింది.
ఎంత మంచి వారమ్మా పాఠం
ఎంత మంచి వారమ్మా పాఠం రచయిత వెన్నెలకంటి రాఘవయ్య గారు.
ఎంత మంచి వారమ్మా పాఠం ఇతివృత్తం జీవన వైవిధ్యం.
ఎంత మంచి వారమ్మా పాఠం ప్రక్రియ వ్యాసం.

వెన్నెలకంటి రాఘవయ్య గారి కవి పరిచయం
వెన్నెలకంటి రాఘవయ్య గారి కాలం 04/06/1897 to 24/11/1981
నెల్లూరు గాంధీగా పేరొందిన వారు వెన్నెలకంటి రాఘవయ్య గారు.
వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు , సంఘ సేవకులు , చరిత్రకారులు.
వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వాతంత్ర్య సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు.
వెన్నెలకంటి రాఘవయ్య గారు అందుకున్న పురస్కారం పద్మభూషణ్
1973 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది.
యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు వెన్నెలకంటి రాఘవయ్య గారు రాశారు.
తెలుగులో లో ఆడవి పూలు , నాగులు , చెంచులు , సంచార జాతులు వంటి పది పుస్తకాలు వెన్నెలకంటి రాఘవయ్య గారు రాశారు.

Post a Comment

0 Comments